పుట:Peddapurasamstanacheritram (1915).pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఖ్యాతికెక్కిన రాజచంద్రులచేత బరిపాలింపబడి విరాజిల్లిన శ్రీ పెద్దాపుర చరిత్రమిప్పటికి ముగింపునకు వచ్చినది. కన్నులారజూత మన్న చారిత్రము మాత్రము గాన్పించుచున్నది గాని సంస్థాన మూరును బేరుష గర్భమున మటుమాయ మైనది. ఆహా! ఎప్పు డెటుపోయి యెటువచ్చునది కుత్తర క్షణమున నేమి సంభవించునదియు గూడ నొక్కంతయైనను దె కదా! భగద్విలాస మెంతటి కవి పుంగవూలకైన వర్ణనా దుస్సాద్యము చ ములు దుర్గ్రాహ్యములు.

        పూర్వమొకప్పు డీపెద్దాపుర సంస్థానములోనివే యని, ఇప్పటికిని కొట్థాం, వీరవరము, కిర్లంపూడి, జగ్గంపేట, గొల్లప్రోలు, గోపాలపురము, కపిలేశ్వరపురము, మున్నగు యస్టేట్లు మాత్రము నిలిచి ఎన్నిసంస్థానములు పోయినను ఎన్ని రాజ్యములు నశించిననూ వాని మాత్రము చిరస్థాయిగా నుండగలవు.