పుట:Peddapurasamstanacheritram (1915).pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విశేషాంశములు.

------

1. పెద్దాపురముకోటయొక్క పదునెనిమిదిబురుజులలోను, తాళ్ళబురుజు, హనుమంతబురుజు, తోకబురుజు, మున్నగునవి సుప్రసిద్దములు.

2. కోటలో నిప్పటికిణి మదీనాపాచ్ఛాగారి గోరీయని యొక గోరీ కలదు ఇది పది యడుగుల పొడవు కలదు. ఈ గోరీ కోట కట్టటకు బూర్వమునుండియుండెనని పెద్దలందురు. ఈ పెద్దాపుర సంస్థాన ప్రభువులందరు మహమ్మదీయుల పండుగ దినములలో విశేషోత్సవము చేయుచుండెడివారు. ఈగోరీ విషయమై కొందరు మహమ్మదీయ పండితుల కనుగొన, నీస్థలమొక పుణ్యక్షేత్రముగా ను గ్రంఢముల జెప్పబడినట్ట్లు చెప్పుదురు. అందులకు దారా_ణముగా నేటేటా బరప్రదేశ్హములనుండి కొంతమంది యాత్రీకులువచ్చి మ్రోక్కుబడులు చెల్లించుచుందురు.

3. కొఠ్ఠాం యస్టేటు కీర్తిశేషులైన శ్రీరాజా వెంకటసింహాద్రిజగపతిరాజు గారి పెద్ద భార్యగారగు శ్రీ రాజా వత్సవాయ వెంకటసుభడ్రయ్యమ్మాజగపతి దేవి గారివలన బరిపాలింపబడుచున్నది. వీరు పరిపాలనమునకు వచ్చిన సంవత్సరము ననే వీరి రాజధానియగు తుని గ్రామమునం దొక వేదశాస్త్రపాఠశాలను స్థాపించి, విద్యార్దులకు భోజన వసతు లేర్పరచి ప్రసిద్దిగాంచిరి. తమ భర్తగా రేర్పరిచిన హూణపాఠశాలాభివృద్దికి పాటుబడుచు, భీదలగు విద్యార్ధులకు భోజనవసతులేర్పరచి కొందరికుచిత విద్యనిప్పించుచు, దేశాభివృద్దికి పాటుబదుచున్న సంగతి యాంధ్రలోకమెరింగియున్నది. వీరధికారమునకు వచ్చిన పిమ్మట బంధుకోటి కనేక భూవసతులను నగదు వసతులను, నేర్పాటు చేయుచు అధునికాంధ్రక్షత్రియులోక మున మిగుల ప్రఖ్యాతి నొందుచున్నారు. వీరి పురాణశ్రవణాసక్తియు, దైవారాధన తత్పరతము, నెల్లరకు విశదమే. వైష్ణవభక్తాగ్రేసరియగు నీసాధ్వి కోలంక నివాసస్థులును, భాగవతాగ్రేసరులును, బంధుజనాభిమానులును, నాపితామహులకు మేనమామగారును, నకు శ్రీదంతులూరి అచ్యుతరామరాజుగారికి ప్రధమపుత్రిక. వీరి సంస్థానమున సుమారు నలుబది గ్రామములు కలవు. కొంచెము హెచ్చుతగ్గుగా ముపదివేల రూప్యముల పేష్కషు గవర్నమెంటువారికి చెల్లించబడుచున్నది. ఒకప్పుడు మహదైశ్వర్యభోగముల ననుభవించి, నిస్తుల శౌర్యపరాక్రమాదుకును, అపార పాండిత్యసంపదకును ఆంధ్రకవీంద్రపోషణమునకును, బ్ర