పుట:Peddapurasamstanacheritram (1915).pdf/95

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పిమ్మట కొంతకాలమున కనగా 1873వ సంవత్సరమున జ్ణాతులలొ వచ్చిన కలహములవలనను, వేరు కొన్ని ఇతరకారణములవలనను, కోట భూమి లోగిళ్లు దొరతనమువారి వశము చేయబడినట్లు చెప్పబడుచున్నది.

శ్రీరాజా సూర్యనారాయణ జగపతిరాజుగారు సంస్థానమును విచ్చివేసినందులకై గవర్నమెంటువారు వీరికి నెల కారువందల రూపాయిలు వారు పుచ్చుకొని, నూరు రూపాయిలు వీరి సోదరులును, పెద్దాపుర గ్రామములొ నివాసముగా నున్నవారును నగు శ్రీరాజా తిమ్మజగపతి రాజుగారి కిచ్చుచువచ్చిరి.

ఈతిమ్మజగపతిరాజుగారికి శ్రీరాజా వెంకటజోగీజగన్నాధజగపతిరాజుగారు, శ్రీరాజా వెంకటనారాయణజగపతిరాజుగారు, శ్రీరాజా వెంకటసూర్యనారాయణ జగపతిరాజుగారు ననుమువ్వురు కుమారులు గలిగిరి. వీరిలో జ్యేష్ఠులగు శ్రీరాజా వెంకటజోగీజగన్నాధజగపతిరాజుగారికి శ్రీరాజా వెంకటసుదర్శనతిమ్మజగపతిరాజు గారను పుత్రులును, శ్రీరాజావెంకటజోగీజగన్నాధజగపతిరాజుగారను పౌత్రులును గలరు. రెండవవారగు శ్రీరాజా వెంకటనారాయణజగపతిరాజుగారికి శ్రీరాజా వెంకటసూర్యనారాయణజగపతిరాజుగారను పుత్రులును, శ్రీరాజా వరాహవెంకట నారాయణజగపతిరాజుగారు, శ్రీరాజా వెంకటసూర్యనారాయణజగపతిరాజుగారు నను పౌత్రులును గలరు.

పై వారిలో శ్రీరాజాతిమ్మజగపతిరాజుగారు, వారి జ్యేష్ఠపుత్రులగు శ్రీరాజా వెంకటజోగీజగన్నాధజగపతిరాజుగారును చనిపోయినపిమ్మట శ్రీరాజా వఎంకట నారాయణజగపతిరాజుగారును, వారి సోదరులును, తమకు