పుట:Peddapurasamstanacheritram (1915).pdf/9

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అని గుడిమెట్టలో విశ్వేశ్వరస్వామిని ప్రతిష్ఠాపనము జేసెనని చెప్పబడియుండుటచేత రామవిలాసములోని నరసింహునిపోతరాజును, ఈ దోరపరాజు పోతరాజును నొక్కదే యని చెప్పదగును.

అట్లయినయొదల దోరపరాజునకు నరసింహరా జను నామాంతరము గల దని యూహింపవలయును. ఇంతియుగాగ బెజవాడ కనకదుర్గాంబయొక్క యాలయములో శ్రీ నరసింహవర్ధ్నచాగిపోతరాజు పేరిట శాసన మొకటి గలదు. అయ్యది నరసింహుని కుమారుదడైన చాగిపోతరాజు సశాసన మని తెలుపుచున్నది. కాబట్టి ఇప్పుడు దోరపరాజు నకు నరసింహరా జనునామాంతరముగలదని విశ్వసింతము. ఈ పోతరాజు త్రిపురాంతక కాశ్మీర మల్లేశ్వర విశ్వనాధ చోడ నారాయణస్తానంబుల గనక కలశంబులను బెట్టించి, సింహగిరియందు నరసింహునకు సాగిపోతసముద్రం బను చెరువుగట్టించి శ్రీపర్వతమున శ్రీశైలమున మల్లికార్జునదేవునియెదుట నందికేశ్వరునిం బ్రతిష్టించి, దేసభోగంబులకై కంభముపాడు, ముచ్చింతలు, బూదవాడ మొదలగు గ్రామముల నిచ్చి బ్రాహ్మణోపభొగంబులుగా ననేకాగ్రహారంబు లొసంగె నని బెజవాడ శాసనమున జెప్పబడియున్నది. ఈ శాసనము కాకతిగణపతిదేవచక్రవర్తి సింహాసన మధిష్ఠించిన క్రీ.శ. 1199దవ సంవత్సరమున వ్రాయబడినది. ఈకుటుంబములోనివాడగు సాగిమనుమగనపదిదేవునిశాసనములు కూడ పెక్కులు నందిగామలో గానవచ్చుచున్నవి. అతడును, చాగిరాజును కాకతిగణపతిదేవుని సమకాలికులు. వీరు నతవాటిసీమలో నధికారమును వహించి యుండిరి. ఈ సాగివంశపురాజులచరిత్రమును సంపూర్ణముగా దెలిసికొనుటకు మరికొంతకాలము పట్టును. ఇప్పటికి దొరకిన సాధనము లసగ్రములగనున్నవి." ముక్త్యాలశాసనమునుబట్టి పంతులవా రుదహరించిన వమ్శానుకమణిక కొంచెము వ్యత్యాసముగ గాన్పించుచున్నది. ముప్పరాజునకు త్యాగిరోరపరా జనుపుత్రుదు గలడని వ్రాయబదియుండెనే గాని గోంకదోరపరా జనికాదు. అదియుగాక యీ త్యాగిదోరపరాజుపుత్రుడయిన పోతరాజునకు త్యాగరాజు లేక చాగిరాజనుపుత్రుడు గలడని పంతులవారు వ్రాయించియున్నారు. కాని ఆ సశాసనమువలననే పోతరాజు నకు దోరపరాజే పుత్రడయినటుల గాన్పించుచున్నది. ఆశ్లోకముల నిట నుదహరించు చున్నాడను.

తస్మా న్ముప్పధారాధిపా ద్విభు రభూ త్యాగాఒకదోరాధి పః
తద్దోరక్షితివల్లభా ద్గుణనిధిః పోతక్షమాధీశ్వరః
శ్రీమ త్పోతనరేశ్వరా న్మునినిభా ద్రాజాంబికాయా మభూ
త్సూను ర్దాననవీనభానుతనయ స్త్యాగీక్షమాధీశ్వరః ||