పుట:Peddapurasamstanacheritram (1915).pdf/68

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొని రావలసినదని యానందజగపతిరాజుగారు పాయకరాయనిగారికి సెలవిచ్చిరి. ఆ ప్రకారమె యాయనయు వెల్లి వారిని తీసుకొని వచ్చిరి కాని యానాడే మూడుజాములకు దమభౌతిక దేహమును జాలించి వారు తమ ఇరువదఐదవయేట అనగా క్రీ.శ 1759 వ సంవత్సరములో సరియైన ప్రమాదిసంవత్సర పుస్యసుద్ద నవమి నారు వీరస్వర్గ ప్రాప్తులైరి.

ఈ లోపున రావు నీలాద్రిరాయనింగారు శ్యామలకోట విడిచిపెట్టి పారిపోవుటను తెలిసికొని గజపతిరాజుగారు ఉండూరునుంచి శ్యామలకోటకి వచ్చి కోటలోనున్న ఫ్రెంచి పక్షపాతులను తరిమి తిరిగి యచట అంగ్లేయుల బావుటాను నిలిపిరి.

ఈ ప్రకారము జగపతి రాజుగారి పాలన ముగింపునకు వచ్చెను. శ్రీరామవిలాసమను మహాప్రభంధమును రచియించినట్టియు, ముందుజెప్పబోవు తిమ్మజగపతిగారి కాశ్రయులై యుండునట్టియు నేనుగు లక్షణకవిగారు ఈ జగపతిరాజుగారి కాలమున యిత నుండింట్లాయనచే రచియింపబడిన ఈ క్రింది చాటుపద్యము నుడువుచున్నది.

 ఉ|| "ఆయత వత్సవాయ సుకులాంబుధి పూర్ణనిశాపతీ ! జగ
జగద్గేయశుభాకృతీ ! విధితకీర్తిసతీకమనీ యయౌవన
ప్రాయలాకృతీ ! సతతవై భవనిర్జిత పూర్వదికృతీ !
దీయుత వాక్సతీ ! జగపతీ ! నృపతీ ! సుకృతీ ! మహోన్నతీ ! "

ఈ జగపతిగారు కవిత్వము నందు నిపుణులై పెక్కు పద్యములను శ్తకములు మొదలైనవి బద్రాద్రి రాములమీద జెప్పినట్లు రామ విలాసములోని ఈ పద్యము ద్వారా తెలియుచున్నది

"పదములు గీర్తనల్ రుచిర పద్యశతంబులు రాగమాలికా
మృదుషదందబులు సమిద్ద్గతి ంరచియించి కామిత
ప్రభునకు భద్రశైలప్రభుభర్తకు గానుకగా నొసంగెనే
ఆశ్రితులు మెచ్చ దా జగపతిప్రభుచంద్రుడు భక్తిపెంపునన్ "

ఆనంద గజపతిగారి మరణము.

శ్రీ వత్సవాయ జగపతి రాజు గారు చనిపొయిన తర్వాత వారి సహదర్మచారిణియగు సీతమ్మ గారు కామెయొక్క బర్తృమరణప్రకారంబంతయు రామభద్ర వెరినాతి నుండియె విజయనగరపు పూసపాటివారు గజపతిబిరుదమును పెద్దాపురపు వత్సవాయ వారు జగపతి బిరుదమును వహించినట్లుగా కనిపించుచున్నది.