పుట:Peddapurasamstanacheritram (1915).pdf/67

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆనందగజపతిరాజుగారు తమ సైన్యములను దీసికొని శ్యామలకోటలోనున్న ఫ్రెంచి వారిని దరుమగొతట్టి యాంగ్లేయుల బావుటాను మరలబాతుటకై యుద్ధప్రయత్నములు చేసికొని సైన్యముతో చాళుక్యభీమవరము వద్దనుండి వెళ్లుచుండిరి. అప్పుదు రావునీలాద్రిరానింగారును జగపతిరాజుగారును కాకర్లపూడివారితో గలిసి కొన్ని వేలపౌజుతో గజపతిరాజుగారిని మార్కొననరిగిరి. కాని మార్గమద్యమున వీరిసైన్యములొ గొంతభాగ మేకారణముననో వెనుకకు తగ్గినది. అప్పుడు నీలాద్రిరాయనింగారు సంగథి సందర్భములను సైన్య స్థితిగతులను,యుద్ధోపకరణవిధానములను విచారించి ఈ సందర్భమున మనము నిగ్రహించుట కష్టమనియు, నిప్పుడు తిరిగి శ్యామలకోట వెళ్లుట యుక్తమనియు జగపతిరాజుగారితో నుడివిరి. కానీ జగపతిరాజుగారమేయపౌరుషముతో, వచ్చినవార మెట్లును రానేవచ్చినారము, యుద్ధరంగమునకు బ్రయాణమైవచ్చి మెనుకకు మరలిపోవుట వీరవరేణ్యులకుచితమగునా? తిరిగి మరలుముఖము పెట్టుట శౌర్యలక్షణము కానేరదని చెప్పి యతిసాహసముతో మిగతాబలముతో గజపతిరాజు గారి నెదిరింపబొయిరి.

ఈ యుబయసైన్యములు ఉండూరు (శ్యామలకోట సమీపస్థగ్రామము సమీపమున సంధించినవి. అచ్చట నొగ గొప్పసంకుల సమరముజరిగెను. ఈ యుద్దమున గజపతిరాజుగారి దాటికి నిలువలేక రావునీలాద్రిరాయనింగారు యుద్ధరంగమునుండి పారిపోయి తిరిగి శ్యామలకోటకవచ్చి యచ్చటనున్న చిన్నవాండ్రను వెంటబెత్తుకొని యింక నక్కడ నిలువక జూపల్లెవారి సంస్థానములొనిదగు రాఘవపురమునకు వెల్లి యటదాగియుండిరి. జగపతిరాజుగారు మాత్రము ధైర్యశౌర్యములతో నిలబడి యమితవిక్రమమునుజూపుచూ సమరక్రీడను సలుపుచుండిరి. ఇట్లుండగా ఆయన యాకస్మికముగా గుండుదెబ్బతగిలి నేలంబడిరి. అంతట ఈ సమాచారము ఆనందగజపతిగారికి తెలియజేయునప్పటికి కాయన తలకొట్టి తీసుకురావలసినదని కటినమైన ఉత్తరువు చేసిరి