పుట:Peddapurasamstanacheritram (1915).pdf/45

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

-*మహమ్మదీయుల సర్వాధికారము*-

(క్రీ.శ. 1734 మొదలు 1749 వరకు)

రాగమ్మగారగ్నిప్రవేశ మొనర్చుతరి, నామెదగ్గర కొంపెర్ల మహాలక్ష్మి యను నొక బ్రాహ్మణవితంతువుండెను. అప్పుడా రాగమ్మగారు తమకు మనుమడును, తిమ్మరాజుగారికి కొమారుడును, నేడాది శిశువునై యున్న జగపతిరాజు గారిని విజయనగరమునందున్న పూసపాటి విజయరామరాజుగారి భార్యయు, తన సోదరీసమానము నైన చంద్రయ్యమ్మగారికి సంగతియంతయును జప్పి యొప్పగించవలసినదని చెప్పెను. అంతట వితంతువైన నాబ్రాహ్మణియు నేకసంవత్సరప్రాయుడైన యారాచకొమరుని నామె యాజ్ణాప్రకారము విజయనగరమున గొనిపోవ బయలుదేరి వచ్చుచుండగా గొంతమంది మహమ్మదీయభటు లామెను ద్వా రమువద్ద నడ్డగించి యీ రాజపుత్రు నెచ్చటకు దీసికొని పోవుచున్నావని యడుగ నామె యతడు రాజపుత్రుడు కాడనియు, తన కొమారుడె యనియు బ్రమాణముచేసి చెప్పెను. అటుపిమ్మట నాభటులు సం శయమనస్కులై యామెవచనంబులను విశ్వసింపజాలక తమ సంకోచముం దీర్చుకొన నొక జామిపండు తెచ్చి యాబాలునికిచ్చి, యతనిచే నాఫలమును గొరికించి యా ముచ్ఛిష్టఫలము నామెను భుజియింపవలసినదని యానడిరి. అనతట నామెయు, నారాజపుత్రసంరక్షణమె తన విధాయకకృత్యముగా నెంచి, కులభేదము వించుకయుం బాటిసేయక, యేక త్సందర్భమున నాభటులకేమాత్రము ననుమానము వొడమునట్లు కూడ నటియింపక, వారానతిచిన తత్క్షణమే యా ముచ్ఛిష్టఫలమును భుజించి యాతురకల సంశయము నివారించెను. పిదప నాభటులును నామెవాక్యములు విశ్వసనీయము లైనవిగనెంచి బాలకసహితముగ నామెను వదలి పెట్టిరి. ఆక్షత్రియపుత్రప్రాణత్రాతయైన యా మహాలక్ష్మియు దన గమ్యస్థానము జేర చేబ్రోలుమార్గముపట్టెను.