పుట:Peddapurasamstanacheritram (1915).pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక.

-:0:-

ఏదైనా ఒక పని చేయడం - విమర్శించడం (ఆక్షేపణ చేయడం) అంత సులువు కాదు బాషలో అక్షరాలు ఉన్నంత వరకూ నోరు ఉన్నంత వరకూ విమర్శలకు (హేళనకు) కొరత ఉండదు. పనిచేసే వారు తక్కువ - విమర్శించే (అధిక్షేపించెవారు) ఎక్కువ ఉండటం ప్రపంచ స్వబావం - లోకవిరుద్ధం కాదు

 ఆకారణం వల్లే పెద్దాపుర సంస్థాన చరిత్రము మొదటి ముద్రణ కొన్ని విమర్శలకు గురి అయ్యింది అంతమాత్రానికే నిరుత్సాహ పడిపోయే వాణ్ని కాదు నేను. చాలా మంది విద్యాధికులు (well educated people) నన్ను ప్రోత్సహించారు వారిలో ముఖ్యులు గుంటూరు డిప్యుటీ కలెక్టరు మరియు ఆంద్ర సాహిత్య పరిషత్ కార్య నిర్వాహక అధ్యక్షులు అయిన బ్రహ్మర్షి జయంతి రామయ్య పంతులు B.A B.L (బి.ఎ - బి.ఎల్), యల్ . టి గారు గోదావరి జిల్లా సంఘ కార్యదర్శి - మహారాజశ్రీ దుగ్గిరాల సూర్యప్రకాశరావు పంతులు బి ఎ గారు, విజయనగరం మహారాజావారి కళాశాల అధ్యక్షులు శ్రీమాన్ రావు బహద్దూర్ కిళాంబి రామానుజాచార్యులు యం ఎ బి ఎల్ ఎఫ్ యం యు గారు గవర్నర్ జనరల్ గారి శాసనసభా సభ్యులు శ్రీ రాజా పానుగంటి రామరాయనిం గారు యం ఎ ఇంకా మరి కొంతమంది ఇచ్చిన అమూల్యమైన అభిప్రాయాలకు సలహాలకు నేనెంతో కృతజ్నుడుని.

మనదేశంలో చారిత్రిక విషయాలపట్ల జ్ఞానం ఇంకా మొదటి దశ (శైశవదశ) లోనే వుండటం వల్ల ఇలాంటి ప్రోత్సాహాలు-నిరుత్సాహ పరచడాలు ప్రతి చరిత్రకారుడికి ఉంటాయి. అంత మాత్రము చేత రచయిత (గ్రంధ కర్త) నిరుత్సాహ పడవలసిన అవసరంలేదు. ఇంకా రచయిత (గ్రంధ కర్త) యొక్క ప్రధమావస్థ (రచనలు చేసే ముందు అతని ఆలోచనా తీరు-పరిస్థితి) గురించి కొంచెం చెప్ప వలసి వుంది . పెద్దాపురం సంస్థానము యొక్క చరిత్ర నామ రూపములు లేకుండా జీర్ణించి పోతుందని నెలల తరబడి మద్రాస్ పట్టణం లో ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి అక్కడే ఉండి నన్ను ఎంతమంది నిరుత్సాహ పరచినా, నాకు ఆంధ్రా- ఆంగ్లేయ బాషల పై అంత పట్టు లేకపోయినా పట్టుదలతో అతి కష్టం మీద మూడు సంవత్సరాలకు గ్రంధమును పూర్తిచేసాను. నిరుత్సాహ పరిచిన వారిని ఈ ఆంద్ర లోకం ఎప్పటికీ క్షమించదు. నన్ను ఆ విధంగా నిరుత్సాహ పరచడం వారికి ధర్మం కాదు.