పుట:Peddapurasamstanacheritram (1915).pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పబడుచున్నదనియు బావిణీకోటయు, యోదుకోటయు, విశాఖపట్టణము గంజాము మండలములోనిదనియు, నవిశిధిలములైయున్నవనియు తెలియుచున్నది. వీనిననుసరించి చూడగా వత్సవాయవారు, పూసపాటివారి ప్రభుత్వమున్నతదశనందకపూర్వమే గంజాము విశాఖపట్టణముమండలములలోని యాయాభాగములను జయించి ప్రఖ్యాతిగాంచిరని నుడువలసి యున్నది.

ఇట్లుండపరాక్రమవంతులై యనేకరాజులను జయించి పెక్కుదుర్గముల నాక్రమించి సాటిరాజులందరిలో శ్రేష్ఠులై సార్వభౌమశ్రీతిమ్మరాజుగారువినుతిగాంచిరి.

ఈయన తాతగారైన మొదటి తిమ్మరాజుగారు ఆయనయొక్క యేలుబడిలో ఆయనపితల్లి కొమారులైన గణపతిరాజునారాయణరాజుగారికి చిల్లంగిమొదలగు గ్రామములను గొన్నింటిని "జమియ్యతు" క్రింద "మొకరదు" చేసియుండిరి. నాటినుండియు నారాయణరాజుగారు చిల్లంగిలో మట్టికోటగట్టించి గ్రామములు బందోబస్తుచేసుకొనియుండిరి. కాని యాగణపతిరాజువారికిని ఈతిమ్మరాజుగారికిని సరిపడాక విరోధమువచ్చి యంతకంతకు శత్రుత్వము ప్రబల మయ్యెను. అందుమీద నీతిమ్మరాజుగారు ఈ చిల్లంగికోటను ముట్టడించి యచ్చటి పరిపాలకులను సాధించి కోటను స్వాధీనముచేసికొని యాగ్రామములను గిమ్మూరు పరగణాలో గలుపుకొనిరి.

ఇదివరకు గొంతకాలమునుండియు బెండపూడి ఇసుకపల్లి పరగణాలు మహమ్మదీయ పాలష్కరుల (సైన్యాధిపతుల) యధీనము క్రిందనుడుచువచ్చినవి. కాని వానినుండి తమకుదగినంత రాబడిరానందున వారు దానిని పిఠాపురాధీశుల కంటగట్టప్రయత్నించిరి. కాని, యాపరగణాలు పాడులోనున్నవనియు, వానింజేకొనుట నష్టమునకే కని లాభమునకుగాదనియు, నందువలన నారెండు ప్రగణాలను దాము భరించలేమనియు బిఠాపురపు వారు చెప్పగా నాతురుష్కాధికారులు బెండపూడి పరగణాను బిటాపురపురావువారికిని, ఇసుకపల్లి పరగణాను పెద్దాపురపు వత్సవాయవారికినిద్ఖలుపరచినారు.నాటినుండియు ఇసుకపల్లిపరగణా వత్సవాయవారి యధీనముక్రిందకువచ్చెను. పెద్దాపురపు సంస్థాన మీకాలముననే చాలాగావిరివి జంది, సర్వవిధముల నభివృద్ధిగాంచినదగుటచేత, నిదియే దీనికుచ్చదశయని యూహింపనగును. ఈరాజ్యవిస్తారమువలననే శ్రీ తిమ్మరాజుగారు సార్వభౌమబిరుదమును వహించినట్ట్లు త్లంచవలసియున్నది.

ఈయన యెంతపరాక్రమవంతుడో యంత సత్కార్యధీక్షాసముత్సాహుడు.

మ. నిధినిక్షేపతటాక దేవగృహము ల్నిర్మించెంద్యద్దయో
దధియులు దీనుల బ్రోచె షోడశమహాదానంబులుజేసె నం