పుట:Peddapurasamstanacheritram (1915).pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పైపద్యచతుర్ధచరణమున బేర్కొనబడిన పూసపాటిసీతారామరాజుగారిని గూర్చి యొకింతచెప్పుట కాధారములుకలవు గాన ఆయననుగురించి ఈ క్ర్రిందజెప్పబోవుచున్నారము. ఈపూసపాటివారినిగూర్చి రాయబహదూరు శ్రీ కందుకూరి వీరేశలింగముపంతులుగారు తమ "ఆంధ్రకవులచరిత్ర" యందిట్లువ్రాసియున్నారు.

"ఓరుగంటియందుండిన కాకతీయరాజులు చెప్పుకొనునట్లుగానే ఈ పూసపాటి వారును తాము సూర్యవమ్శజుడైన మాధవవర్మ సంతతివారమని చెప్పుకొందురు. కొండపల్లి సర్కారులోని పూసపాడను గ్రామనివాసముచేత వీరికి పూసపాటివారని యింటిపేరు కలిగినది. ఓరుగంటి సంంస్థానము ప్రతాపరుద్రునితో నశించినవెనుక వత్సవాయవారు పూసపాటివారు మొదలైనవారు మహమ్మదీయులకు లోహడిరి. రఘునాధరాజను మారుపేరుగల పూసపాటి తమ్మిరాజు గారు గోలకొండలో సరదారుగానుండి శ్రీకాకుళమునకు వచ్చి శ్రీకాకుళమునకు పౌజుదారుగానుండిన షేర్ మహమ్మదుఖాన్ వలన 1652 వ సంవత్సరమున కూలిమి భోగాపురముతాలూకాలను గుత్తకుపుచ్చుకొని పాలనముచేయ నారంభించెను. ఈయనపుత్రుడైన సీతారామచంద్రరాజుగారు మరికొన్ని తాలుకాలనుగూడా కవులునకుబుచ్చుకొని పర్లాకిమిడిసంస్థానాధిపతియయిన గజపతిదేవునితో మైత్రి సంపాదించి, 125 గుర్రపౌరౌతులతోనూ, 450 కాల్బలములతోనూ పొట్నూరు జయించి కళింగరాజని పేరుడసి యాయూరు నివాసమేర్పరచుకొని ప్రబలుడయియుండెను."

"ఈసీతారామచంద్రరాజుగారు గొప్పపరాక్రమవంతుడనియు, రాజనీతివిశారదులనియు తెలియుచున్నది. వీరేముసలితిమ్మరాజుగారి సమకాలికులు, ఈయినమెచ్చుకొనునట్లుగనే తిమ్మరాజుగారు విజయముగాంచింరని లక్షణకవి వర్ణించి యున్నాడు."

"పూసపాటి తమ్మిరాజుగా రెనినుండి కూలిమిభోగాపురము తాలూకాలను కవులునకు దీసికొనిరో యట్టి శ్రీకాకుళపు పౌజుదారుడైన షేర్ మహమ్మదునే లక్ష్మణకవి పైపద్యమున "స్రసమ్యుయననాధీశుదురగపతిని" అని వర్ణించియున్నాడు. ఈ షేర్ మహమ్మదునుగూడ గయ్యమునగెల్చి విజయలక్ష్మీపరిగ్రహణ మొనరించినవాడాగుటచే శ్రీతిమ్మసార్వభౌముడు శ్రీకాకుళమువరకునుండు దేశమును దన దోర్వీర్యముచే వార్జించెనని నిస్స్ంశయముగా వక్కాణింపవచ్చును.

"పైపద్యమున జెప్పబడిన తక్కిన బావిణీకోటనుగురించి కానీ, యోదుకోటను గురించి కానీ, దుగరాజునుగురించికాని వెశేషాంశములు తెలియుటలేదు. కాని దుగరాజుశబ్దము విశాఖపట్టణముజిల్లా లోని పాచిపెంటజమీందారులచే,బిరుదముగ నుపయో