పుట:Peddapurasamstanacheritram (1915).pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లుండగా వానిని లోపుచేసికొని కోటనుగట్టించి మన్నుగోడ పెట్టించి, వానిపై జుట్టును బురుజులు తీర్పించి దానికి దక్షినమున పెద్దాపురమను పేటను గట్టించి ప్రభుత్వము చేసెను. తరువాత విస్సమ్మ యను రెడ్డివనిత యీ సీమలను బరిపాలించుచు రెండువేలపౌజులకు సరదారుగా నున్న వత్సవాయ ముసలితిమ్మరాజుగారికి తనఖా బెట్టెనట. ఆమెయనంతరము ముసలితిమ్మరాజుగారు పెద్దాపురముకోట కధిపతులై వేదాద్రికి మంత్రియైయుండి మహమ్మదీయలకు రాజమహేంద్రవరదుర్గమును వశపరచి, తాను వారికి మిత్రుడై పెద్దాపురప్రాంతదేశమును మహమ్మదీయులు జయించినను తానే స్వతంత్రపరిపాలనము చేయనారంభించెను. వీర పౌరుష పరాక్రమాదివిశేషములు రామవిలాసములో__

సీ.రణమున గుర్రపురౌతులరిమార్చె వాసిగా నెరజెర్లవాకలోన
బెద్దపురంబున బిరుదాంకపురిలోన