పుట:Peddapurasamstanacheritram (1915).pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గజపతులపక్షమున సీతాపతి, వేదాద్రి వత్సవాయ ముసలి తిమ్మరాజుగారును దండెత్తి వచ్చి, ఏలూరుదుర్గమును ముట్టడించిరి. ఏలూరు సర్కారునకు డిలావర్ ఖానుడు గవర్నరుగానుండి, కోటలోనుండి యధికపౌరుషముతో బోరాడెను గాని నిష్ప్రయోజనమై, మిక్కిలి దురవస్థలో నుండి, గోలకొండ కనేకచారులను బంపించి సహాయమునకై నిరీక్షించి యుండెను. అంతట ఇబ్రహీము తన్ను ముట్టడించియున్న శత్రువులతో సంధిచేసికొని కొంతసైన్యమును డిలావర్ ఖానునికు దోడ్పడుటకై యేలూరునకు బంపించెను డిలావర్ ఖాను డీసైన్యము యొక్క తోడ్పాటుచే శత్రువులను దరిమి, కుతుబ్ షాహయొక్క ఉత్తర్వును శిరసావహించి శత్రువులు, సరిహద్దును దాటిరాకుండ, నిడదవోలులో నొకకోట గట్టించెను ఈ కోటను గట్టి డిలావర్ ఖాను రాజమహేంద్రవర దుర్గమును ముట్టడించి స్వాధీనము చేసికొనుట యుక్తమని కుతుబ్‌షాకు భోదించెను.


రఫత్ ఖానుని దండయాత్ర.


అప్పుడు హరిచందన దేవుడు లేక విష్ణు దేవుడను ఆంద్రుడు గజపతుల రాజ్యము ఆక్రమించుకుని, బంగాళాదేసశము మొదలుకుని గోదావరి పర్యంతముగల తూర్పు తీరమును పరిపాలించుచుండెను. రాజమహేంద్రవర దుర్గం ఇతని రాజ్యము లోనిదిగా వుండి ఆ ప్రాంతానికి పరిపాలకుడిగా వున్న వేదాద్రిచే (రెడ్డి కాబోలు) సంరక్షించ బడుచూ ఆంద్ర మహమ్మదీయులకు దుస్శాద్యముగా ఉండెను. ఈ దుర్గాద్యక్షుడైన వేదాద్రి కొంచెం ఇంచుమించు గా స్వతంత్రుడై వ్యవహరించు చుండెను. రెడ్డి సంస్థానమునకు పరిపాలకుడై వేదాద్రి కి ప్రధాన మంత్రిగా ఉన్న వత్సవాయి పేర్రాజు గారి పుత్రుడు మహా వీరుడు అయిన ముసలి తిమ్మ రాజు గారు రెండు వేల సైన్యమునకు అధీశ్వరుడైన సర్దారుగా నుండది మహామ్మదీయులతో చెలిమి చేయ నారభించెను. ఆయన మహమ్మదీయులకు తోడ్పడినందుకు ప్రతిపలము గా వారు కిమ్మూరు సీమ తమ కిచ్చునట్లు ఒప్పందం చేసికొనెను ఇంతే కాక కళింగ దేశమున మాండలిక రాజు లన్యోన్యము వంచకులై, యొండరులతో పోరాడుచుండిరి. బంగాళా దేశ ప్రాంతము నుండి శత్రువులు దండెత్తి వచ్చుట ఇబ్రహీము ఉత్సాహ వంతు దిన దిలావారు ఖాన్ కోరిక ను మన్నించెను. అప్పుడు ప్రసిద్ధి కెక్కిన సేనాని అగు రపత్ ఖాను లారీయను నతనికి మల్లిక్ నాయబ్ అను బిరుదము నొసంగి, సైన్యాద్యక్షునిగావించి, తక్షణము పోయి నిడదవోలు దుర్గమున