పుట:Paul History Book cropped.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
9. సూతస్వభావాన్ని ఈయడం

పూర్వవేదంలో దేవుడు సృష్టి చేసి నరులనూ భౌతిక ప్రపంచాన్ని పుట్టించాడు. అది పాత్రసృష్టి. దీని నుండి పౌలు నూత్న సృష్టి అనే భావాన్ని గ్రహించి ఆ భావాన్ని క్రీస్తుకి అన్వయించాడు. దేవుడు క్రీస్తు ద్వారా నరుల్లో నూత్నసృష్టిని తీసుకొనివచ్చాడు అని చెప్పాడు. అనగా క్రీస్తు మరణోత్థానాలు ప్రాత నరులను నూత్న నరులుగా మార్చివేస్తాయని భావం. దీన్ని గ్రీకులో "కాయినెక్టిసిస్' అంటారు. పూర్వవేదంలో ప్రాత ఆదాము వున్నాడు. అతనికి బదులుగా నూత్న ఆదామైన క్రీస్తు వచ్చాడు. ఈ క్రీస్తు ద్వారా మనం నూత్న నరులం ఔతాం. బైబుల్లో ప్రాత పాపానికీ, క్రొత్త పవిత్రతకూ చిహ్నంగా వుంటాయి.

ఎవడైనా క్రీస్తునందుంటే అతడు నూత్న సృష్టి ఔతాడు -2కొరి 5, 17. నూత్న ఆదామైన క్రీస్తు తన మరణోత్థానాల ద్వారా మనకు నూత్నత్వాన్ని ప్రసాదిస్తాడు. క్రీస్తు ద్వారా మనం దేవునికి పోలికగా సృజింపబడిన క్రొత్త స్వభావాన్ని పొందుతాం -ఎఫే 4,24. క్రీస్తు ద్వారా మనలోని ప్రాత స్వభావం అంతరించిపోయి క్రొత్త స్వభావాన్ని స్వీకరిస్తాం. నూత్నసృష్టి అంటే నూత్న స్వభావమే.

ఆదాము ప్రాత మానవజాతికి శిరస్సు. అతని భౌతిక స్వభావం మనకుకూడ వచ్చింది. క్రీస్తు నూత్న మానవజాతికి శిరస్సు. అతడు ఆర్జించిన రక్షణం మనకు నూత్న స్వభావాన్ని దయచేస్తుంది. మనం క్రీస్తు రూపాన్ని పొందుతాం -రోమా 8,29. జ్ఞానస్నానం ద్వారా, ఆత్మద్వారా మనలో ఈ మార్పు వస్తుంది. ఈ క్రొత్త స్వభావం మనలను నీతిమంతులనూ పరిశుదులనూ చేస్తుంది -ఎఫె 4,24.

ఒక్క నరులేగాక భౌతిక ప్రపంచం గూడ ఉత్థానక్రీస్తు ద్వారా నూత్నత్వాన్ని పొందుతుంది. అది ఆ గడియకొరకు కాచుకొనివుంటుంది - రోమా 8,21-22,