పుట:Paul History Book cropped.pdf/39

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


క్రీస్తుకి అన్వయించాడు. తండ్రి క్రీస్తు మరణోత్థానాల ద్వారా పాపపు నరులను పరిశుదులనుగా మార్చివేసాడు. మనం చెడ్డనుండి మంచికి వూరతాం.

పూర్వవేదంలో సీనాయికొండమివాద యూవే తేజస్సు సోకి మోషేముఖం ప్రకాశించింది -నిర్గ 34,29. నూత్నవేదంలో తండ్రి తేజస్సు వలన ఉత్థాన క్రీస్తు ప్రకాశించాడు. ఆ వుత్థాన క్రీస్తు తేజస్సు వలన అతని శిష్యులమైన మనం ప్రకాశిస్తాం. మనం క్రీస్తు పోలికను పొందుతాం. అనగా క్రీను ఆర్జించిన రక్షణం వునలను పరిశుదులనుగా మార్చివేస్తుందని భావం -2కొరి 3,18.

దేవుడు మొదట వెలుగును చేసాడు. ఆ వెలుగు ఉత్థాన క్రీనుపై ప్రసరించింది. ఉత్సాన క్రీను డవుస్కు త్రోవలో వెలుగురూపంలో పౌలుకి దర్శనమిచ్చాడు. దాని వలన అతడు పూర్తిగా మారిపోయి క్రీస్తు శిష్యుడు అయ్యాడు. ఆలాగే క్రీస్తు వెలుగు ఇప్పడు మనలను కూడ మార్చివేస్తుంది -2కొరి 4,6.

క్రీస్తు బలహీనమైన మన మర్త్యశరీరాన్ని తేజోవంతమైన తన శరీరాన్ని పోలివుండేలా మార్చివేస్తాడు -ఫిలి 3,21. ఇది ఉత్థానం తర్వాత జరుగుతుంది.

క్రీస్తు తెచ్చే మార్పు వలన మనం నీతిమంతులమూ పరిశుదులమూ ఔతాం. అనగా మనకు దివ్యత్వం లభిస్తుంది. కాని ఈ మార్పు దిడీలున వచ్చేది కాదు. ఇది చాల కృషి వలన, చాలకాలం తర్వాత సిద్ధించే ఫలితం. నరులు తమ బుదులను మార్చుకోవడం ఎంత మాత్రం సులభం కాదు. ఒక్క దేవుడే గాని మనం మంచికి మారేలా చేయలేడు.