పుట:Paul History Book cropped.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పౌలు గ్రీకుల స్వేచ్ఛాభావాన్ని క్రీస్తుకి అన్వయించాడు. మనం పరలోక పౌరులం -ఫిలి 3,20. అనగా క్రైస్తవులకు పరలోకంలోను భూలోకంలోను గూడ స్వేచ్ఛ వుంటుందని భావం. క్రీస్తు తన మరణోత్థానాల ద్వారా మనకు స్వేచ్ఛను ప్రసాదించాడు. మనం స్వతంత్రులంగా వుండడానికి క్రీస్తు మనకు స్వేచ్ఛను దయచేసాడు. కనుక మనం మళ్లా దాస్యమనే కాడిక్రిందికి రాకూడదు -గల 5,1. యూదమతాభిమానులు గ్రీకు క్రైస్తవులు ధర్మశాస్తాన్ని పాటించాలని పట్టుబట్టారు. కాని అది వారి స్వేచ్ఛను అపహరిస్తుంది కనుక పౌలు ఈ వాదాన్ని అంగీకరించలేదు. మనం స్వతంత్రురాలైన సారా బిడ్డలంగాని బానిసయైన హాగరు బిడ్డలం కాదు అన్నాడు –ෆ්ෆ 4,31.

క్రీను రాక ముందు మనం పాపానికీ మృత్యువుకీ, ధర్మశాస్రానికీ, శారీరక వ్యావెూహాలకూ బానిసలం. క్రీసు మరణోత్థానాలు వీటన్నిటినుండి మనకు స్వేచ్ఛను ప్రసాదించాయి.

ప్రభువు దయచేసే స్వేచ్ఛను ఆత్మ మన హృదయంలో వృద్ధిచేస్తుంది. ఆత్మ వున్నచోట స్వాతంత్ర్యం వుంటుంది -2కొరి 3,17. ఈ యాత్మ మనం కామం, క్రోధం, స్వార్థం మొదలైన శారీరక క్రియులను జయించేలా చేసుంది. క్రీనుకి చెందినవాళు వ్యామోహాలతో కాంక్షలతో కూడిన తమ శరీరాన్ని సిలువ వేస్తారు -ෆ්ෆ 5,24.

క్రీస్తు మనకు స్వేచ్ఛను ప్రసాదించింది ఎందుకు? విచ్చలవిడిగా ప్రవర్తించడానికి గాదు. ఒకరినొకరు ప్రేమించడానికీ, ఒకరికొకరు ప్రేమతో సేవలు చేసికోవడానికీని. కనుక సోదరప్రేమ, సేవ స్వేచ్ఛాఫలాలు అనాలి -గల 5, 13. L