పుట:Paul History Book cropped.pdf/35

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కన్పిస్తాయి. తండ్రి మన కొరకు క్రీస్తుని సిలువ మరణానికి అప్పగించాడు-రోమా 8,32. క్రీస్తు మన పాపాల కొరకు ఆత్మార్పణం చేసి కొన్నాడు -గల 1,4. మనలను ప్రేమించి మనకొరకు ప్రాణత్యాగం చేసికొన్నాడు - గల 2.20.

5. విమోచించడం

పూర్వవేదంలో ఓ సంప్రదాయం వుండేది. ఎవడైనా యిస్రాయేలీయుడు పేదవాడై ఓ యుజమానునికి బానిసగా అమ్ముడుపోతే అతని దగ్గరిచుట్టం ఆ యజమానునికి డబ్బు చెల్లించి అతన్ని బానిసంనుండి విడిపించాలి. ఆలా విడిపించేవాణ్ణి హీబ్రూలో "గోయెల్" అనీ, గ్రీకులో 'లూబ్రోటెస్" అని పిల్చేవాళ్లు. యజమానునికి చెల్లించే క్రయధనాన్ని గ్రీకులో "లూట్రాన్" అన్నారు -లేవీ 25,47-49. ఈ సంప్రదాయం ప్రకారం యావే ప్రభువు ఫరోకు బానిసలైన యిప్రాయేలీయులను దాస్యంనుండి విడిపించాడు. ఫరో వారిని పీడింపగా ఆ ప్రజలు దేవునికి మొరపెట్టారు. అతడు వారికి దగ్గరి చుట్టమై వారిని బానిసనుండి విడిపించాడు. ఇదే విమోచనంఅనగా విడిపించడం. దీని ద్వారా యిప్రాయేలీయులు యూవే ప్రజలు అయ్యారు -నిర్గ 19,5. కాని యావే ఫరోకు క్రయధనం చెల్లించలేదు. అతని సైన్యాన్ని నడిసముద్రంలో ముంచివేసి సర్వనాశం చేసాడు.

యూదులు మళ్లీ బాబిలోనియా ప్రవాసంలో చిక్కు కొన్నారు. ప్రభువు వారిని ఆ దాస్యంనుండి కూడ విడిపిస్తానని బాస చేసాడు -యెష 51,11. మెస్సియా వచ్చే అంత్యకాలంలో గూడ వారిని పరాయి దాస్యంనుండి విడిపిస్తానని మాటయిచ్చాడు -కీర్త 130,7–8.