పుట:Paul History Book cropped.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ సమాధాన ప్రక్రియలో మూడు దశలు వున్నాయి. మొదటిది, దేవుడే రాజీ ప్రక్రియకు పూనుకొన్నాడు. రెండవది, పౌలులాంటి బోధకులు దేవునితో సమాధానపడమని ప్రజలకు బోధించారు. వారి హృదయాలను సిద్ధం జేసారు. మూడవది, ఈ బోధవలన ప్రజలు పరివర్తనం చెంది దేవుని నుండి పాపక్షమాపణం వేడుకొన్నారు. దేవుడు వారిని కరుణించి క్రీస్తుద్వారా వారి పాపాలు మన్నించాడు.

ఇప్పడు మనజీవితంలో కూడ ఇదే జరుగుతుంది. మ నం దేవునితో సమాధానపడి తోడి నరులను కూడ ఆ ప్రభువుతో రాజీపరచాలి. వారితో వారిని ఐక్యపరచి దేవుని దగ్గరికి తీసికొని రావాలి. వారిలో వారికి తగాదాలు పెట్టి వారిని విభజించకూడదు. మన దురాదర్శం వల్ల తోడి నరులను గూడ పాపకార్యాలకు ప్రేరేపించి దేవునికి దూరం చేయకూడదు.

4. పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడం

పూర్వవేదంలో పాపాలకు ప్రాయశ్చిత్తం చేసే కర్మ ఒకటుంది -లేవీ 16,14-16. గుడారంలోని గర్భాగారంలో మందసం వుండేది. దానిమివాద కరుణా ఫలకం వుండేది. దానిమిధాద షెకీనా అనే పేరుతో దైవసాన్నిధ్యం నెలకొని వుండేది. ఈ ఫలకానికి గ్రీకులో ‘హిలాస్తేరియోన్" అనీ హిబ్రూలో 'కిప్పోరెట్" అనీ పేరు. ప్రాయశ్చిత్తదినాన ప్రధానయాజకుడు గర్భాగారంలోనికి ప్రవేశించి ఈ కరుణా ఫలకం విూద కోడె నెత్తురు చిలకరించేవాడు. దాని ముందు నేలమిద కూడ ఏడుసార్లు నెత్తురు చిలకరించేవాడు. అటుపిమ్మట మేక నెత్తుటిని గూడ ఆలాగే చిలకరించేవాడు. దీని భావం ఏమిటి? L