పుట:Parishodhana sanputi1 sanchika3 Aug-sep 1954.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తొలి తెలుగు కవయిత్రి

శ్రీమతి బాణగిరి రాజమ్మగారు.

శ్రీ ప్రభాకర శాస్త్రిగారి తక్కిన సాహిత్య యజ్ఞ మంతా ఒక యెత్తు. తాళ్ళపాక తిమ్మక్క వ్రాదిన ' సుభద్రా కల్యాణం ' పాటను ప్రకటించి ఆమెను తొలి తెలుగు కవయిత్రిగా నిరూపించడ మొక యెత్తు.

పడతుల పాటలన్నా, పామరుల పదాలన్నా పండితులకు రోత. వానిలోని కవితా మాధుర్యాన్ని గ్రహించి పరిగణించడం చాల ఉదారమైన పని. సరసహృదయులే అలాటి పనికి పూనుకుంటారు. అలాటి వారు శ్రీ శాస్త్రిగారు.

స్త్రీల పాటలు వేనకువే లున్నాయి. కాని వాటిని వ్రాసినవా రెవరో, పాడినవా రెవరో పేరు తెలియదు. ఇప్పటికి దొరకిన పాటలలో పేరు తెలిసిన పాట సుభద్రా కల్యాణమే.

" ఆరనిలో తాళ్లపాకాన్నయ్యగారి తరుణి తిమ్మక చెప్పె దాను సుభద్ర కల్యాణ మనుపాట కడు మంచి తేట పలుకుల....."

అని ఆమె స్పష్టంగా చెప్పుకొన్నది గనుక ఎవరు దీనిని వ్రాసిం దనే వివాదమే లేదు. అన్నమాచార్యుని వంటి పదకవితా పితామహుని పత్ని గనుక తిమ్మక్క శ్రుతపాండిత్యంతో నే ఇలాటి పాటలు కట్టి వుంటుంది. సందేహం అక్కర లేదు