పుట:Paribhashikapadh015114mbp.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

5

ములకు కారణమైనను కాలక్రమమున భాషార్ణవము నందు లీనములై దత్వమును బడయగలవు.

  ఆంధ్రగ్రంధమాలయందు "పారిభాషికపదకోశము" 27 వ కుసుమముగ ప్రచురింపబడినది. గ్రంధముద్రణ ము ప్రారంభమై చిరకాలముగ ప్రచురణమునందు కాల యాపనం జరుగుట విచారకరము. గ్రంధమునందు శారీరక, జ్యోతిష, వృక్ష, రసాయన, వ్యాకరణ, భూగోళ, న్యాయ, గణిత, వైద్య, వేదాంత, భౌతిక, రాజ్యాంగ, జంతు శాస్త్రాదులకును, లలితకళలకును సంబంధించిన పారిభాషికపదములు సాధ్యమైనంత వరకు చేర్చబడినవి. పారిభాషికపదములను నిర్ణ యించి జేర్చుటయందు గల సాధకబాధములు భాషాభిజ్ఞలకు తెలిసిన విషయము. గ్రంధము అసంపూర్తి, పునరుక్తి, మొదలగుదోషములతో నుండి యుండుట సహజముల్. ఆంధ్రభాషాభిమానులు లోపములను మన్నించి గుణములను గ్రహించుటకు ప్రార్థితులు. వివిధశాస్త్రములకును కళలకును సంబంధించిన పదములను గ్రహించుటయందు వినియోగపడిన గ్రంధములకును గ్రంధకర్తలకును ప్రకాశకులకును ఆంధ్రగ్రంధమాలా నిర్వాహకులు కృతజ్నులు. శ్రమ చేసి పదములను కరించి ముద్రణమును సాధ్యము చేసిన శ్రీ తిరుమల వేంకటరంగాచార్యులుగారికి కృతజ్నులము.
శత. సం. ఆశ్వయుజ బహుళ చతుర్ధశి:

కా. నా గే శ్వ ర రా వు