పుట:Parama yaugi vilaasamu (1928).pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

[5]

ద్వితీయాశ్వాసము.

65


యామహీసారనాయకుఁ డైనశౌరి
యామౌనిసుతుఁ డున్నయట కేగుదెంచి
వనధిమేఖల గారవమున లాలించి
తనకటాక్షామృతధారలచేతఁ
దనివి నొందించి యంతట సేదదేర్చి
తనరించి యంత నంతర్ధాన మైన
జలజాక్షువిరహంబు సైరింపలేక
యెలుఁ గెత్తి యాబాలుఁ డేడ్చునత్తఱిని
మలయంగ నెడ దుప్పిమై నోర గాఁగ
మొలత్రాటఁ జెక్కినమోటకత్తియును
గొనసిగతోఁ గూడి కురు లొకయింత
గనుపట్టఁ జెరివిన గన్నెరాకమ్ముఁ
గొనల వెల్వడుపుట్టగోఁచియు నెరులు
బెనఁగొన్న నునుదబ్బపీఁచు డా కేల
వెడవెడ జివ్వాడు వెదురుసలాక
యెడమచే బొటవ్రేలి యినుపయుంగరము
నడరంగ [1]యడమొట్టి యగుగొడ్డుటావుఁ
బిడిముక్కుతోడునఁ బెనచి [2]రాఁబట్టి
తనతోడిజోడు మేదరులు సోదరులు
వెనువెంటఁ జన నొకవేణులావకుఁడు


  1. యెడమోటి
  2. చేఁబట్టి