పుట:Parama yaugi vilaasamu (1928).pdf/505

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

488

పరమయోగివిలాసము.


కొంకక జీనిపై [1]గోవరకంగు
లంక యయ్యోధ్య మలాక యీడాము
మొదలైనదీవులు మునుకొనివచ్చి
యదనబేహారంబు లాడంగఁ జూచి
మంచిరత్నములు హేమము లున్నయట్టి
సంచులు వారున్నసంచులు దెలిసి
సమరేయిమైఁ జొక్కు చల్లి సంధించి
తివుటమై దొంగిలితెచ్చుచు మఱియు
నునుపులు పెట్టుచు నొదిఁగి డాఁగుచును
గనుమలు గట్టుచుఁ గనుపుఁ గొట్టుచును
గబ్బునం బురములు గన్నపెట్టుచును
[2]సుబ్బికం బెరచోటఁ జొప్పువైచుచును
దెచ్చినధనమెల్ల దినదినంబునకు
వచ్చిన యలభాగవతులకు మఱియుఁ
జనుదెంచునట్టివైష్ణవులకు భక్తి
పెనుపొంద షడ్రసోపేతంబు గాఁగఁ
బొదలుచు నారగింపులు సేసికొనుచు
మదనమన్మథుఁ దనమైఁ బాదుకొల్పి
యీరీతి దొంగిలునెడ శంఖచక్ర
ధారులఁ దిరుమణి ధరియించువారిఁ


  1. గోవలెక్కంగు
  2. సుబ్బినం