పుట:Parama yaugi vilaasamu (1928).pdf/504

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షష్ఠాశ్వాసము.

487


యానించి బేహార మాడంగ నటకు
వానికై చనుదెంచువారల వానిఁ
బూని బేహరమాడి పోవువారలను
బోనీక మీఁద కాఁపులుపెట్టి కాచి
తెరు వడ్డగించి గద్దించి ధైర్యంబు
దెరలంగఁ గొట్టి చేతిని యాఁచికొనుచు
వరుస నొక్కెడఁ దెరువరుల చందమున
నరుగుచుం గనమసందరికట్టికొనుచుఁ
గిదుకక మొగమెఱింగినవారిఁ జేరి
పొదివిపట్టుచు నోళ్ల బొటుల [1]ముందరిగి
గొబ్బునఁ దొలఁగఁ దోకొనిపోయి చెట్టు
గబ్బువీలగఁ గట్టుకాసెలం గట్టి
యదయులై కలవెల్ల నపహరింపుచును
సదయులై వెండియు సాగనంపుచును
అరుదైన నగరంబులందు వెండియును
బరదేశముల సెట్లపగిది దిండుగను
బెల్లుచుట్టిన పెదపెదముడాసులును
డొల్లుబొంగులును నీటుగఁ బొందుపఱచి
పొదిగల్గు [2]నసిమల భుజములం బూని
వదలుగా రింటెముల్ వలెవాటువైచి


  1. ముల్‌దురిగి
  2. నసిబలు