పుట:Parama yaugi vilaasamu (1928).pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34

పరమయోగివిలాసము.


ధళధళం బొలుచుకుందనపువాకిళ్ళ
చలప నిచ్చలపుఁబచ్చలతోరణముల
సురనీలవిరచితసోపానతతుల
గురుచంద్రకాంతపుఁగొణిగెచూరులను
జలువనెత్తావులు సారెకు మలయ
మలయమారుతముల మలయుమాళిగలఁ
గళుకుకంబముల బంగారుబోదియలఁ
జిలుకలచాలు దీర్చినవలీకముల
నింపొంది మఱియు ననేకచిత్రములఁ
బెంపొంది లోచనప్రీతి రెట్టింప
నంచితం బగు సదనాంతరసీమ
మించిన శేషవల్మీకంబు [1]చెంత
మదిరి పసిండిచే నొనరించినట్టి
[2]మదిరె చేతులవయ్యు మాళిగెమీఁద
నోట నొక్కొకమాఱు నొడివినం బుణ్య
కోటి నిచ్చుచుఁ బుణ్యకోటి నా వెలయు
బంగారు మేడలోపలభూమిఁ గల్గు
సింగార మొకకుప్ప చేసినరీతిఁ
జెందమ్మిరేకులఁ జెనకుపాదములఁ
జెందిన పసిఁడి గజ్జియలు నందియలు


  1. చేర్ప
  2. మదిని చేతులవయ్య