పుట:Parama yaugi vilaasamu (1928).pdf/358

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్థాశ్వాసము.

341


దమ్మికెంగేలు గదాపాణితలము
క్రొమ్మించు కెందమ్మి గుంపులనీన
వలనొప్పు పదియాఱువన్నెలదట్టి
ధళధళల్ దశదిగింతంబులం బొదువ
డాలైన మకరకుండల చకచకలు
[1]వాలుఁజెక్కులను దువాళముల్సేయఁ
బూసిన సిరిగందవొడిబుగబుగలు
డాసి పంకజభవాండము చోడుముట్ట
మిండతుమ్మెదలకామెతలుగావించు
దండినెమ్మేనిచెంతల గోండ్లిచూప
నెలమించుదీవల నెలయించుమేని
చెలువ యురోవీథిఁ జెన్నగ్గలింప
నురుతరకౌస్తుభద్యుతిపల్లవములు
దొరసి వక్షోవీథిఁ దుళగింపుచుండ
నెమ్మోముదామర నెరయునెత్తావి
కమ్మకస్తురితిలకపుఁదేఁటి గ్రోల
రంగనాథుఁడు తనరంగ విహంగ
[2]పుంగవు నెక్కి వేల్పులు గొల్వ వచ్చి


  1. పాలుచెక్కుల మరువాళముల్ సేయ
  2. పుంగవనాయకాద్భుతవాహుఁ డగుచు