పుట:Parama yaugi vilaasamu (1928).pdf/321

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

304

పరమయోగివిలాసము.


నలకాముకులహృదయములలో మంట
వెలిమించె నన నొప్పె విధుమండలంబు
వేదన గలమౌనివిరహార్తిలతకు
బ్రోది సేసినరీతిఁ బొదలెఁ జంద్రికలు
రంగనాయకుఁ డొనరంగ నాయంగ
రంగవైభవముల రాజసం బెసఁగ
నప్పు డేకాంతపాయస మారగించి
చొప్పడుముత్యాలసొంపు దీపించి
క్షీరతరంగంబుచె న్నగ్గలించి
హారపుంజంబుచాయలఁ గ్రిందుపఱచి
కపురంబు చవచపఁగా నాడి మంచు
రపణంబు విడియించు రమణఁ జెన్నొందు
నహిరాజశయనంబునందు నిందిరయు
మహియు నీళయును బ్రేమము దయల్వాఱఁ
గెమ్మోవి దలిరాకు గేలించుకేలి
దమ్ములఁ బాదపద్మంబు లొత్తంగ
నొప్పుగా నొకవింతయొయ్యార మొదవఁ
గప్పినహేమాంశుకంబు చూపట్ట
జడిగొన్న ముత్తెంపు జల్లి [1]గింట్లెముల
[2]విడియంబు డాపలఁ బెంపొందుచుండఁ


  1. గెఁటొరలఁ
  2. బిడియంబు