పుట:Parama yaugi vilaasamu (1928).pdf/309

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

292

పరమయోగివిలాసము.


యని రంగవిభునకు నంతరంగమున
ననలొత్తుభక్తి సన్నతిఁ జేయుచున్న
నప్పు డాపర్లశాలాంతరసీమ
నొప్పుచుం బవళించియున్న యాయోగి
యలవిమీఱిన యమ్మహావృష్టి యిపుడు
[1]వెలిచెనో వెలవదో వివరింతు ననుచు
మసకలక ద్వారసీమకు వచ్చి హస్త
కిసలయాగ్రమున వాకిలి యూఁది నిక్కి
జలదికీర్ణము నాకసముఁ దొంగి చూచి
యలరావిక్రిందటియలివేణిఁ జూచి
తొలుత నభ్రంబునఁ దుళగించుమించె
యిల వ్రాలెనో కాక యిది యది యైన
దండనె చలనమొందక రూపుతోడ
నుండునే యనుచు ని ట్లొకకొంతతడవు
తలపోసి తలపోసి తరళాక్షి ! యనుచుఁ
బలుకరింపుచు నిజభావంబుఁ గాంచి
జక్కవకవ వెక్కసపు[2] వలవాడి
ముక్కుల నొత్తినమురువు దీపింపఁ
బనుపడ నులిపచ్చిపయ్యెదకొంగు
మొనలనానినకుచముల నొప్పుదాని


  1. వెలిసెనో వెలియదో
  2. వలపాటి