పుట:Parama yaugi vilaasamu (1928).pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

266

పరమయోగివిలాసము.


మొదలైనభూరుహంబులు పుష్పలతలు
పదివేలతెరఁగులఁ బ్రబలిచూపట్టి
యొక్కకైవడి [1]లాకలాత్తి తలిర్చి
పక్కొమ్మ లిడి పాదుపడి చెట్టుగట్టి
యలరుచు నొకటి సహస్రమై పెరిఁగి
చలిమీఱి శాఖోపశాఖలై నెగడి
వెడవెడ తూణంబు వెడలినయట్టి
నెడవిల్తుమిట్టల వింతలై యొప్ప
మొనచూపి ననలొత్తుమొగడులం దనరి
మినుకుదేఁటులతోడ మేకులు చేసి
యీనినగతి నాకు నిగురుబక్కొమ్మ
గానరాకుండ నల్గడ విఱ్ఱవీఁగి
[2]వరిబండ్లనాఁ గనవచ్చు బొమ్మనఁగ
నెరతావి దిక్కుల నిండి వాసింపఁ
గ్రిక్కిరియుచుఁ బుష్పగిరులచందమున
నొక్కెడం బూచె నయ్యుర్వీజతతులు
ఆమౌనిశీతాంశుఁ డంతరంగమున
నామోదవార్షి నోలాడి యంతటను
దనపెట్టుపైరులు తనకన్ను లెదుట
ననిచెఁ గా యనుచు నానందించునడుమ


  1. లోక
  2. వరలిపండ్లనంగ