పుట:Parama yaugi vilaasamu (1928).pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్థాశ్వాసము.

265


నినుపుగాఁ గావేరినీరుగా రెమునఁ
దనివార నెత్తి యంతట [1]జేడవెట్టి
యులిపచ్చియైయుండ నొకయింతయూరి
పలకెక్కి గుగ్గిలపదునుగానిచ్చి
పరువడి గుద్దలిపార సొంపార
నిరుచాలువడఁ ద్రవ్వి యిరునాటు వైచి
కాలువ లొనరించి గనిమలు దీర్చి
చా లేర్పరించి యాచాయ నంతంతఁ
బాదులు సవరించి పైరులు సావి
[2]పోదులు నొరివి నేర్పున నాటుకొలిపి
యాయెడ నీరాన నలరుపూబొదల
డాయఁ జెంగల్వయోడలు పొందుపఱచి
కాపాడి గూడులుగట్టి శైత్యంబు
పైపైనఁ గావింపఁ బ్రబలి నానాఁటఁ
బొన్నలు బొగడలు బొండుమల్లియలు
గన్నెరుల్ కలుగొట్టు కాంచనంబులును
మల్లెలు కురువేరు మరువంబు పచ్చ
మొల్లలు నారదంబులు గొజ్జగులును
బారిజాతములు సంపంగులు తులసి
గోరంటలును గేతకులు నశోకములు


  1. జాడ
  2. ప్రోదుల నెఱిఁగి.