పుట:Parama yaugi vilaasamu (1928).pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

పరమయోగివిలాసము.


[1]నాతరుచ్ఛాయఁ దా ననువొంద నిలిచి
ఏతెంచుముక్తుల కెదు రేగి వారిఁ
గొమరార భూషించుకొఱకు భూషాంజ
నములు [2]జలములుఁ జూర్ణములు మాలికలు
వేర్వేఱఁ బూని సవిస్మయాకృతులఁ
బర్విన యచ్చరపడఁతు లేనూఱు
లనిశంబు నచటికి నరుదెంచుముక్తు
లనుకైరవముల నపాంగచంద్రికలఁ
జాలువార వికసింపఁ జేయుచు నచట
మెలఁగుచుండుదురు సమేలంబుతోడఁ
జల్ల నై తద్దివ్యజనపదంబులకు
[3]నెల్ల యై యమృతవాహిని యై చెలంగి
యావరపురిచెంత నమితసంసార
దావతప్తాత్ముల తాపంబు దీర్చి
పురుడింపఁగా ద్రవీతభూత యైనట్టి
కరిరాజవరదుని కరుణయ సోలె
భాసిల్లి విరజ నాఁ బనుపడి ప్రకృతి
వాసనాపాంసువుల్ వడి నడంచుచును
నమల మై యెపుడు ముక్తాశ్రిత యగుచు
నమిత మై పరమహంసావృత యగుచు

  1. నాతరువులనీడ
  2. జెలములు రాజేలములు
  3. నెల్లనై