పుట:Parama yaugi vilaasamu (1928).pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

పరమయోగివిలాసము.


ప్రాకృతపద్మకైరవసమూహంబు
లేకాలమును దమ కెనయే యటంచు
నగుచు సదా ప్రసన్నత మించి మించు
లగునట్టి పద్మకల్హారంబు లెసఁగు
నాసారపుష్పనీరాపూర్ణ దివ్య
కాసారశతములఁ గలిగి పెంపొందు
నచ్చట విలసిల్లు నారామతతులు
నిచ్చలు సౌరభానీకము ల్గలిగి
తరులతారూపముల్ తాల్చిననిత్యు
లరుదార ముక్తు లై యరుదెంచువారి
నెలకొన్న తమవైన నీడలచేత
ఫలములచేతఁ బుష్పంబులచేత
నుపచరింపుచు నుండు నుచితవైఖరుల
నెపుడు నత్తరువుల నెక్కి చూపట్టు
శుకపికాదులు శౌరిసుండు ప్రాఫ్యుండు
ప్రకటంబుగా నని పల్కుచు నుండు
నందులోఁ గొన్ని యుద్యానశైలాదు
లిందిరాసతి నటియించులీలలకె
ప్రతి లేక [1] యెప్పుడుఁ బాల్పడియుండుఁ
బతి[2]లీలకే పాలుపడియుండుఁ గొన్ని


  1. యెపుడుఁ బాల్పడియుండు లోక
  2. లీలలకె