పుట:Parama yaugi vilaasamu (1928).pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

214

పరమయోగివిలాసము.


కడుఘోర మైన యీకష్టవాక్యములు
నుడువంగ మాకు [1]నీనోళు లెట్లాడె
శ్రీవిహారుని నింద సేయుపాపంబు
శ్రీవైష్ణవుల నుతి సేసిన నుడుగు
శ్రీవైష్ణవుల నింద సేసినదోష
మేవిధిఁ బాయు మీ రేమిసేయుదురు
కలుషాలవాలసంగతలతాజహ్వ
లలవరించినబ్రహ్మ ననుటయెకాక
యనుచు నాగ్రహవృత్తి నంతటఁబోక
మనుజేశుఁ డనియె నమ్మంత్రివర్యులకు
శ్రీవైష్ణవుల నింద సేసినమిమ్ము
వేవేగ నాజ్ఞఁ గావించుటే నయము
పదరి యిప్పుడు మిమ్ముఁ బట్టి శిక్షింపఁ
దుదలేనియీజగత్తులు నన్నుఁ జూచి
తనకు నిష్టము సేయఁ దలఁచినయట్టి
తనవారిఁ జంపించె ధరణీశుఁ డండ్రు
తొడిఁబడ నిదియసందుగ వారిమీఁద
సడి వైవఁ జూతురు చపలమానసులు
కావున నారీతిఁ గాక లోకైక
పావను [2]ల్నిర్జితాపారకల్మషులు


  1. దా నో రెటులాడె
  2. నిర్జితపాపకల్మషులు