పుట:Parama yaugi vilaasamu (1928).pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము.

207


నాయెడఁ దమసేయునటువంటిబాస
సేయించుకొని వారిచే దాఁప నిచ్చి
యఱిమురి విభుఁ డెంతయడిగిన నేమ
యెఱిఁగింపు మనక మీ రెఱిఁగింపవలదు
అని సమకట్టి వా రటు వాసి చనిన
జననాథ [1]భాండికజనము చింతించి
జననాథునకు నెంతచనవరు లైనఁ
జన దమాత్యులవాక్యసరణులు మీఱఁ
గడఁగి మీఱిన నెన్నిగతులను లేని
సడి వైచి నృపునకుఁ జౌకపుట్టించి
గొనకొని వడి గుంట గూల్చివదనకఁ
గనుమూయ రెటొ దైవగతిఁ జూచికొనుట
యనుచుండి [2]రట మంత్రు లావాసమునకుఁ
జనిరి డెందముల నుత్సాహంబు లొదవ
జననాథుఁ డంత మజ్జనభోజనాదు
లొనరించి నగరిలో నొకకొంతతడవు
పవళించియుండి యుప్పవడమై చెంత
నవసరంబులవార లపుడు కొల్వునకు
వేళ యయ్యె నటంచు విన్నవించుటయు
నోలగం బొనరింప నుద్యుక్తుఁ డగుచుఁ


  1. భారిక, పౌరిక
  2. రిట