పుట:Parama yaugi vilaasamu (1928).pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

200

పరమయోగివిలాసము.


పరమభాగవతసంభాషణరుచులు
మరగినవాఁ డేల మరగు నన్యంబు
లెంచిచూడక మీర లిఁక నింతనుండి
[1]మించిచెప్పిన మీకు మీ రెఱుంగుదురు
అనిన భీతలి “[2]హసా” దని మంత్రులెల్ల
వెనువెనుకకె వచ్చి వెలవెలంబారి
జననాథుకోపంబు సైరింపలేక
చనిరి గ్రక్కున మొగసాలవాకిటికి
నావసుఛేశ్వరుం డనిశంబు నిట్ల
శ్రీవైష్ణవులఁ గూడి చెన్నగలించి
యీరీతి మఱియు ననేకకాలంబు
వారక యలభాగవతు లిచ్చగించి
యడిగినవెల్ల లేదనక సంప్రీతి
నుడుగక యిచ్చుచునుండి యొక్కెడను
బిరుదమంజీరశోభితపదాబ్జుండు
సరసకుంకుమగంధచర్చితాంగుండు
వరహాలకంకణోజ్జ్వలభూషణుండు
పరిమళకుసుమసంభరితచూడుండు
మకరకుండలదీప్తిమండితాననుఁడు
సకలమాణిక్యచంచత్కిరీటుండు


  1. మిన్నకచెప్పిన
  2. యసా