పుట:Parama yaugi vilaasamu (1928).pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

192

పరమయోగివిలాసము.


గొనబైన వెలితాళిగోణంబుతోడఁ
గనుపట్టి నవరత్నఖచిత మైనట్టి
మురువైన మొగపులమొలనూలివింత
మెఱుఁగులు నలుదెస మిసమిసల్ గొలుప
లీలఁ గ్రొంబచ్చతాళియుఁ బదకంబుఁ
[1]బీలి డెందముమీఁదఁ బేరెముల్వారఁ
దెలివొందు నొంటిముత్తియపు వెన్నెలలు
వెలఁదినవ్వులతోడ వీడుజోడాడ
మగతుమ్మెదల ఱెక్కమబ్బులనెఱులఁ
జిగురులు వెడలఁ గీల్చినకొప్పులోన
నరవిరిబాగుగా నరవిరు ల్దుఱిమి
యరచందురునికి విం దైననెన్నొసల
సన్నపు రేఖమంజలికాపుతోడఁ
దిన్నని [2]తెలిగీరుతిరునామ మలరఁ
దాకొన్న మించుపుత్తడిసరపణులు
డా కేలిమీఁద బిటారంబు నెఱప
మురువైన యపరంజిముద్దుటుంగరము
మెఱుఁగులు మోముదమ్మికి సరికొలుప
మదదంతికటముల మదధార లెసఁగు
చదురునం జెక్కులజవ్వాది జాఱ


  1. పేలి
  2. తెలినీరు