పుట:Parama yaugi vilaasamu (1928).pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

182

పరమయోగివిలాసము.


ఘనులు సౌందర్య రేఖామహోదారు
లనుపమామితధను లగువైశ్యజనులుఁ
ద్రొక్కినచోటెల్ల దున్నక పండ
దిక్కులఁ బసిఁడి విత్తినపైరు గాఁగ
వివరింపఁగాఁ గొండ్ర వేలును బండ
నవనికి నేలిక లైనహాలికులుఁ
జుట్టైన దివి సోమసూర్యవీథులకు
నొట్టు దిద్దెడు సూర్యసోమవీథులును
నీలవర్ణునిమానినీశిరోమణికి
నాలయం బైన దేవాలయంబులును
గప్పు లై, యొప్పు లై కళుకులై తేఁటి
చొప్పు లై గొప్ప లై సొగయుగొప్పులును
గళుకు లై బెళుకు లై కలువపూసోగ
ములుకు లై తళుకు లై మొనయుకన్నులును
సోగ లై బాగు లై సొలపు లై సిరుల
ప్రోగులై వాగులై పొలుచుమోములును
గావులై తావులై కండచక్కెరల
ప్రోవులై ఠీవులై పొలుచుమోవులును
[1]గట్టులై గుట్టలై కామునిపసిఁడి
జెట్టులై చెట్టులై చెలఁగుపాలిండ్లు


  1. గట్లయి గట్లయి కామునిపసిఁడి, జట్లయి జట్లయి చలఁగుపాలిండ్లు