పుట:Parama yaugi vilaasamu (1928).pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము.

105


నరయంగ మఱచి నిజావాసమునకు
నరుదెంచి శుభవేళ నాకోమలాంగి
సిరి మించ దివిజు లచ్చెరు వంది చెలఁగ
వరవైభవముల నుద్వాహ మై యంతఁ
బొలుపుమైఁ గమ్మవల్పులు సోడుముట్ట
నలరుటిండ్లను మణిహర్మ్యవాటికల
భువనజాకరముల భువనేశ్వరముల
నవిరళచంద్రశాలాంతరస్థలుల
నాలేదుతోఁ గూడి యంగజకేళిఁ
దేలి తేలించి యెంతే సొంపు మెఱసి
తద్దయు నింతిపైఁ దగిలినప్రేమఁ
బ్రొద్దుగ్రుంకులు పొడుపులు రాత్రి పగలుఁ
దెలియ కీసరణి మత్తిలి రతికేళి
సలుపుచుఁ బెక్కేండ్లు చనినపిమ్మటను
గొమరుబ్రాయం బను కొమ రైనచెఱకు
నమలినపిప్పి నా నరసె వెంట్రుకలు
[1]పొడిబొడి నెరులతో బొమదోయిబిగువు
సడలినవిం డ్లనా జాఱె నొక్కింత
[2]మున్ను పి న్నెఱుఁగక ముదితతోఁ గూడి
కన్ను గాననిరీతిఁ గప్పెను బొరలు


  1. పొడివడి.
  2. మున్నె పెన్నెఱుఁగక.