పుట:Parama yaugi vilaasamu (1928).pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

v

సందేహించియున్నారు. మఱికొందఱుకూడ తిరువేంగళనాథుని సత్కరించినయాతఁడు వేంకటపతిరాయఁడే యని తలఁచుచున్నారు. కాని వేంకటపతిరాయునికి "వేంకటాద్రి" యను నామము కాన్పింపదు. (1) వసుచరిత్ర (2) చంద్రభానుచరిత్ర అను నాంధ్రగ్రంథములును (1) కువలయానందము, (2) శృంగారమంజరీనాటకము,(అముద్రితము) అను సంస్కృత గ్రంథములును తిరుమలదేవరాయపుత్రుని వేంకటపతిరాయఁడే యని చెప్పినవి. కాన వేంకటపతిరాయుని వేంకటాద్రియని చెప్ప వీలులేదు. తిరుమలదేవరాయుని సోదరునికి "వేంకటాద్రి" యను నామమును చరిత్రకారులు వాడియున్నారు. వసుచరిత్రకారుఁడు కూడ నాతనిని "వేంకటాద్రి" యని చెప్పియున్నాడు. (చూడుఁడు వసుచరిత్ర 1-51) కాన తిరువేంగళనాధుని సత్కరించినయాతడు 1560 సం॥ర ప్రాంతమున నుండుటచేఁ గవియు నప్పటివాఁడె కాని 1600 స॥ర ప్రాంతపువాఁడు కాఁడు. ఈకాలము తిరువేంగళనాధుని తాత యన్నయ్య కృష్ణదేవరాయల కాలమున నుండెనను శ్రీపంతులుగారి యభిప్రాయమునకుఁ గాని యంతకుముందు ముప్పది నలువది వత్సరములకు ముందుండిన శ్రీనాథుని కాలమున నన్నయ్యయుండునను శ్రీప్రభాకరశాస్త్రిగారి తలఁపునకుగాని యంతవిరుద్ధముగా గాన్పింపదు. మఱియు బెదతిరుమలయ్య మండెముకోటలో నుండుట విజయ