పుట:PandugaluParamardhalu.djvu/86

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

హస్తినాపురాన్ని పెకళించడానికి, కోతిని చంపడానికి భీమునికి ధర్మం గుర్తుకు తేవడానికి, యమునానదిని శిక్షించడానికి వాడిన హలంతో బలరాముడు ఆంధ్రులకు ఒక మహోపకారం చేశాడు. తన నాగలి చాలుతో అతడు ఆంధ్రభూమి మీద ఒక నదిని పుట్టించాడు. దానిని మహేంద్రపర్వత శాఖ అయిన నిమ్మగిరుల నుండినూటపదిహేనుమైళ్లు నడిపించి మోపసు బందరు వద్ద తూర్పు సముద్రములో పడునట్లు చేశాడు. అది (లాంగలి=లాంగులము=నాగలి) లాంగుల్య (నాగలి వలన పుట్టినది) అనే పేరుతో నేటికిని ఉంది. దానిని గ్రంధాంతరాలలో లాంగలిని, నాగావళిఅని కూడా అంటారు.

     కర్షకుల కల్పవృక్షమగు తాటి చెట్టు ఇతని కేతన చిహ్నం
     దీనికి సంబందించిన పురాణగాధను శ్రీమండ నరసింహము చిత్ర
భాను శ్రావనా బారతిలో ఇట్లు చెప్పుకున్నారు.

     "కురు పాండవులకు యుద్ధమాసన్నమగుతరి బలరాముడు తీర్ధయాత్రనెపమున దేశసంచారమునకై వెడలెను.  నైమిశ వనమున నాతడు పోవుచు ముని నివాసమొకటి పొడగాంచి యచట వేద శాస్త్ర పురాణాది వాదములను సూతుడు. శౌనకాది మునీశ్వరులకు సన్యసిల్ంచు చుండుటగని యచ్చోగొంత దనుక నాగెను.  సూతడు బోధనమున విమగ్నుడగుటచే బలరాముని రాకగానడయ్యెను.  అర్ఘ్య పాద్యాది సత్కారమీయని కారణమున సూతుని బలరాముడు పూజింప కుండుటకు గినిసి, కోరి తన్నవమానించుటకిట్లు చేసెనని తలచి నాగలి చేబూని వానిగొట్టగా సూతుడు తలదెగి నేలకొఱగెను.  అంతసభలోన సంక్షోభ మంకురింప రాముడును బశ్చాత్తాపమంణ్ది సూతుని బునర్జీవితునిగ జెసెను.  కాని శొనకాదులు బలరాముని చర్యను గర్హించి పాపహరణార్ధమొక నదీతీరమున పంచలింగ ప్రతిష్ట గావింప శాసించిరి.
   బలరాముడు తన ప్రధానాయుధమగు నాగలిని భుజమున ధరించి నైమిశమున (బంగాళము) వీడి కళింగ రాజ్యమున ప్రవేశించెను.  మార్గమధ్యమున వేటకై వచ్చిన కళీంగాధిపతి వ్లన రాజ్యహీనస్థితిని రాముడు తెలిసి కొనెను.  నీటివసతి లేకుండుటచే ఈ హీనస్థితి వ్చచ్చెనని గుర్తించి బలరాముడు కళింగ రాజ్యము నుద్ధరింపనంచి శంకరుని గుర్చి ధ్యానించెను. శివుడాతణీ ప్రార్ధన నంగీకరించి జటాజూటముసడలించి