పుట:PandugaluParamardhalu.djvu/31

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సౌభాగ్యశయన వ్రతము

       ఈ వ్రతమును గురించి మత్స్యుడు మనువుకు  చెప్పినట్లు మత్స్య పురాణములో కలదు. చైత్రశుద్ధతృతీయ పూర్వజహ్నము నందు ఉమామహేశ్వర ప్రతిమలకు వివాహము చేసి కల్పోక్త ప్రకారం పూజలు దానాలు చేస్తే శివలోకప్రాప్తి కలుగును.
      ఈనాడు రామచంద్రడోలోత్సవం చేయాలని స్కృతి కౌస్తుభము, చతుర్వర్గ చింతామణి దీనిని మహా తృతీయ అంటూ అనంతర్య వ్రతం చేయాలని చెబుతూ ఉంది.
                       ఉత్తమ మంవంతరాది
       చైత్రశుద్ధ తదియ శివడోలొత్సవ పర్వమేకాకుండా ఉత్తమ మన్వంతరాది పర్వం కూడా అయి ఉంది.
       మన్వాది అనగా మనువు ప్రభుత్వం చేయడానికి ఆరంభించిన దినము.
      మనువులు పదునలుగురు. అందులో ఉత్తముడు మూడో మనువు. ఉత్తముని కధ వినతగి ఉంటుంది.  స్వాయంభు వంశజుడగు ఉత్తానపాదునకు సురుచి యందు ఉత్తముడు అనే పుత్రుదు పుట్టాడు.  అతడు పరిపాలన దక్షుదు. ధార్మికుడు అతని భార్య బభ్రుమత అయిన బహుళ.
      బఃహుళ అంటే అతనికి వల్లమాలిన ప్రేమ. అతడు ఆమెకు ఎన్నెన్నో నగలు, ఎన్నెన్నో బట్టలు ఇస్తూ ఉండేవాడు.  ఎన్ని ఇచ్చినా ఆమె అతనంటే ఎడమొగమొతగాన్, పెడమొగముగాను ఉంటూ ఉండేది.
       ఒకసారి అతడు నిండు కొలువై ఉండి ఆట పాటలు వినోదములో తన భార్యకు త్రాగడానికి మధుర రసపు పాత్ర అందిచ్చాడు.  పలువురు రాజులు చూస్తూ ఉండగా ఆమె ఆ పాత్రను తిరస్కరించి భర్తను అవమానించింది.  అందుతొ అతనికి కోపం వచ్చింది. ఆమెను అడవిలో విడిచి పెట్టి రమ్మని పంఫివేశాడు.  మగపీడ వదిలింది సుఖపడ్డాను అనుకుంటూ ఆమె సంతోషంగా అడవికి పోయింది.
       ఇది జరిగిన కొంత కాలానికి రాజు కొలువై ఉందగా సుశర్మ అనే బ్రాహ్మణుడు వచ్చి "మహారాజా! నేను నిద్రపోతూ ఉండగా నాభార్యను ఎవరో ఎత్తుకొని పోయినారు.  నాభార్య జాడ వెతికించి తెప్పించి నాకు