పుట:PandugaluParamardhalu.djvu/146

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దుక్కికి సాధనాలయిన ఎద్దుల ప్రాముఖ్యాన్ని గుర్తించారు.

    బండలు పగిలి భరణి కార్తి ఎండల్కు-రోళ్లుపగిలే రోహిణి కార్తి ఎండలు వనకబడ్డాయి. మృగశిర కార్తిలో ముంగిళ్లు చల్ల బడతాయి. ఆమీద ఆరుద్రవాన అదునువాన, వ్యవసాయానికి అనుకూలమైనకాలం.  రోహిణిలో విత్తనాలు చల్లితో రోళ్ళునిండని అల్పపుపంట అని మనరైతులకు అనుభవపునరుక్త విషయం.
    పద్మపురాణపు ప్రతిని జ్యేష్ఠమాసపు పూర్ణిమ యందు దానం చేస్తే అశ్వ మేధఫలము.
    జ్యేష్ఠపూర్ణిమనాడు కృష్ణాజిన దానం పుణ్యప్రదమంటారు.  కృష్ణాజినం మీద కూర్చోవడం కాని పడుకోవడం కాని కఫహరంగా ఉంటుంది.  జడత్వాన్ని మాంద్యాన్ని పోగొడుతుంది.
    జ్యేష్ఠశుద్ధ పూర్ణిమ ధర్మసావర్ణిమన్వంతరాది దినము.  ధర్మ సావర్ణి పదకొండో మనువు.  అతడు ధర్త్మదేవత పుత్రుడు వృషనామకుడు అతని కాలమున ఇంద్రెడు.  ఈ ధర్మదేవత పుత్రుడు వృషనామద్కుడు అతని కాలమున ఇంద్రుడు. ఈ ఇంద్రుని 'వైధృత ' అనే నామాంతరం ఉంది.  హవిష్యంతుడు, అగ్నిదేవుడు మున్నకు వారు సప్తర్షులు.
                         జ్యేష్ఠబహుళ అష్టమి
    తిందుకాష్టమె వ్రతమని చతుర్వర్గ చింతామణి ఏడాదిపాటు ప్రతిమాసం శివపూజ చేయాలి.

    వినాయకాష్టమి అని నీల మత పురాణము
    త్రిలోచనపూజ, శీతలాష్టమి.

                      జ్యేష్టబహుళ ఏకాదశి
 ఆమదేర్ జ్యోతిషీ అనే గ్రంధం ఈ ఏకాదశిని యోగిన్యేకాదశి అని పేర్కొంటూ ఉంది.
     కుబేరుడు ప్రతిదినమూ శివపూజ చేస్తూ ఉండేవాడు.  ఆ పూజకు అతని తోటమాలి ప్రతిదినమూ పూవులు తెస్తూ ఉండేవాడు.  నాడు భార్యాలోలుడై వేళకు కుబేరుడుకి పూవులు అందీయలేకపోయాడు. పూజకుపువ్వులు లేక కుబేరుడుకి పట్టరాని కోపం వచ్చింది.  అప్పుడు అతడు తొటమాలిని కుష్టురోగపీడితుడు కావలసిందిగా శపించాడు.
  కుష్ఠురోగి అయి బాధపడుతూ అతడు ఈ ఏకాదశినాడు ఏకాదశివ్రతాన్ని శాస్త్రయుక్తంగా చేశాడు.  దానికి ఫలితంగా అతని కుష్ఠురోగం కుదిరింది.