పుట:PandugaluParamardhalu.djvu/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మనసులు కలిసి మెలిసే దంపతులువారు. అందులో మగడు కార్యార్ధి అయి దూరప్రాంతాలకు ప్రయాణం పెట్టుకున్నాడు. భర్తత్వరగా తిరిగి వచ్చే ఉపాయం ఏదైన చెప్పమని భార్య ఓషధీ విజ్ఞానం గల ఒక వృద్ధురాలిని ప్రాధేయపడింది. ఆ వృద్దురాలు ఆ భర్తవెళ్లేటప్పుడు ప్రతిరాత్రి చింతచెట్టు కింద పడుకుంటూ వెళ్లేటట్లు తిరుగు ప్రయాణంలో ప్రతిరాత్రి వేపచెట్టు కింద పడుకుంటూ వచ్చేటట్లు కోరమంది. భార్య ఆవిధంగా కోరింది. భర్త అందుకు ఒప్పుకున్నాడు. చింతచెట్టుగాలి చాలా జబ్బుగాలి. అందుచేత భర్తకు ప్రయాణ మధ్యలో జబ్బు చేసింది. కాగా అతడు ఎట్లాగో గమ్యస్థానంచేరి పనిముగించుకొని రాత్రిళ్లు వేపచెట్టు కిందపడుకుంటూ ఇంటికి తిరిగి వచ్చాడు. వేపచెట్టుగాలి ఒంటికి మంచిది కావడంచేత ఇంటికి వచ్చేసరికి అతని ఆరోగ్యం పూర్తిగా బాగుపడింది.

       వేపచెట్టుకు వృక్షశాస్త్రనామం Helia Azadirachta  అని ఇందులోఫ్ Melia  అన్నది గ్రీకుభాషాపదం, Azadirachta అన్నది పారశీకభాషా పద తద్బవం.  పారశీకభాషలో వేప చెట్టుకు Azar Durachta అని పేరు.  దాని అర్ధం ఉత్తమ వృక్షం అని.  ఈపేరువల్లనే వేపచెట్టు శ్రేష్ఠత్వం తెలియవస్తూవుంది.
     అట్టిచెట్టు అంగమొకటి ఈ పర్వ కార్యకలాపంలో మన పెద్దలు ప్రవేశపెట్టారు.
     పంచాంగంలో నింబకుసుమభక్షణం అని ఉన్నా ధర్మసింధువులో ఈ పర్వపు ఆచరణ్ విధానంలో 'నింబపత్రాశవం ' అని ఉంది.  దీనినిబట్టి ఉగాదినాడు వేపాకు తినాలని తేలుతూఉంది.
   పూవూయినా, ఆకు అయినా వేపచెట్టుని సేవించడం ఉగాదివిధాయక కృత్యాలలో ఒకటిగా మన మత గ్రంధాలు చెబుతున్నాయి.  కాగా ఉగాది దినాలువేరైనా నాడు వేపసంబంధమైనపూవో, ఆకో తినడం హిందూదేశంలోని వివిధప్రాంతాల్లో ఆచారంలో ఉంటూఉంది.
    ఆంధ్రప్రాంతంలో ఉగాది పచ్చడిలో వేప సంబంధమైనది పూవే వేస్తారు. మనకు పొరుగువారైన కర్ణాటకులకు కూడా ఉగాది మనతోపాటే. వారున్నూ ప్రాయకంగా వేపపువ్వే వాడతారు.
    అరవవారి ఉగారి వేరేరోజు అయిఉన్నా వారుకూడా ఆనాడు పూవే వాడతారు. అయితే వారిలో చాలామంది వేపపువ్వును పంచదారతో నలుపుకొని తినేస్తారు.  ఆంధ్రులతో సమర్కం ఉన్నతావుల్లో వాళ్ళు