పుట:PandugaluParamardhalu.djvu/102

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యజ్ఞమూర్తి అనే అద్వైత వేదాంతి ఆ రోజుల్లో శ్రీ రంగం వచ్చాడు. అతనికి, రామానుజుడికి వాదం పడింది. ఆవాదం పదహారు రోజులు సాగింది. చివరికి రామానుజుడు జయించాడు. యజ్ఞమూర్తి వైష్ణవం పుచ్చుకున్నాడు. తనపేరు అలాల పెరుమాళ్ ఎంబెవ్రుమానార్ గా మార్చుకున్నాడు.

    ఆ మీద రామానుజాచార్యులు బ్రహ్మ సూత్రాలకు భాష్యం వ్రాయడానికి పూనుకున్నాడు.  బ్రహ్మసూత్రాలని గుఱించి బోధాయన వృత్తి వ్రాయడానికి పూనుకున్నాడు.  బ్రహ్మసూత్రాలను గుఱించి బోధాయన వృత్తి అనే గ్రంధం సంపాదించడానికి అతడు ఉత్తర దేశానికి వెళ్లాడు.  అతని సిష్యుల్లో ఒకడైన కురత్తాళ్వారు ఆ గ్రంధాన్ని కంఠపాఠం చేశాడు.  గురువుకు కావలసినప్పుడల్లా అతడు ఆ గ్రంధాన్నిఅప్పగిస్తూ ఉండినాడు.  ఈ విధంగా సంసిద్దుడైబ్రహ్మసూత్రాలకు భాష్యం వ్రాశాడు.  దానికి శ్రీ భాష్యం అని పేరు.
      వేదాంతసారం, వేదాంత సంగ్రహంఅ, వేదాంతదీపం అనే గ్రంధాలు వ్రాసి ముగించి అతడు శ్రీ భాష్యాన్ని పూర్తిచేసాడు.  గీతకు కూడా అతడు భాష్యం వ్రాశాడు.
   గ్రంధ రచన పూర్తి చేసి వానికి పండితామోదాం సంపాదించడం కోసం వివిధ ప్రదేశాలకు వెళ్లాడు.  కాశ్మీరంలో, పండిత మండలిలో అతడు ఆ గ్రంధాలను చదివి వినిపించాడు.  అ పండితులు అతనిని ఆ గ్రంధాలను అభినందించారు.
  తిరిగి వస్తూ అతడు తిరుపతిలో ఆగాడు.  అక్కడదేవస్థాన,ములోని పూజాదిక విషయమై రెండు తెగల వారికి తగాదా ఉండినది.  అందులో రామానుజుడు మధ్య వర్తిగా ఉండి దేవాలయంలో వైష్ణవ ప్రాబల్యానికి కట్టుదిట్టం చేశాడు.
   అతను బ్రహ్మ సూత్రాలకు భాష్యం వ్రాయడంలో ఆళవిందారు కోరికల్లో ఒకత్రి నెరవేరింది.  మిగతా కోరికలు పూర్తి చేయడానికి అతను ఇప్పుడు పూనుకున్నాడు.  కురత్తాళ్వారు కొదుకైన పరాశర భట్టు చేత సహస్తనామాలకు భాష్యం వ్రాయించాడు.  రామానుజుని చుట్టము తిరుక్కురైప్పిరన్ పిళ్లర్ చేత 'తిరువాయిమొళి ' మీద భాష్యం వ్రాయించాడు.
    ఇట్లు తాను చేయవలసిన పనులు అన్నీ పూర్తి చేసి అతడు