పుట:PandugaluParamardhalu.djvu/101

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పెరియనంబి మనస్సులో నొచ్చుకొని కంచిని వదలి పోయాడు. ఇక తాను ఈ సంసార బంధానికి కట్టిఉబడి ఉండలేడు. కాగా అతడు అప్పుడు సన్యాశ్రమం స్వీకరించాడు.

    ఆళవందారు పీఠాద్యక్ష పదవిని చేకొనమని రామానుజుని వద్దకు శ్రీ రంగాన్నుంచి రాయబారులు వచ్చారు.  అందుమీద అతడు శ్రీ రంగం వెళ్లాడు.  విద్యకు, విమల వర్తనానికి పేరు మోసిన పెద్దల చేత అలంకరింపబడుతూ వచ్చిన ఆ అధ్యక్ష పీఠం మీద కూచోవడానికి తనకు ఇంకా అర్హత లేదని రామానుజుడు సందేహించాడు.  కాగా వైష్ణనాగమములు అన్నీ క్షుణ్ణంగా చదవడానికి ప్రారంభించాడు.  తిరుక్కోటి యార్నంబి ప్రఖ్యాతివిని తన్ను శిష్యునిగా చేకొనవలసిందిగా రామానుజాచార్యులు ఆరుపాదులు కొరారు.  అతనికి ఇంకా అర్హత రాలేదు.  అని అతనిని ఆరు సారులు తిరగగొట్టాడు. ఏడోసారి గురువు అతనిని చేరబిలిచి మంత్రరహస్యం ఎవరికీ చెప్పననే వాగ్ధానాన్ని పుచ్చుకుని శిష్యునిగా చేకొని మంత్రోపదేశం చేశాడు.
      మూక్షం సంపాదించడానికి ఆ మంత్రానికి గల శక్తి అతనికి అంతలో తెలిసి పోయింది.  చాలా ఆనందమైంది.  ఆ ఆనందంలో ఈతను అందరినీ పిలిచి మంత్ర రహస్యం చెప్పేశాడు.  ప్రేమను, సానుభూతిని అగ్గలముగా గర్చితమొనర్చు కొనిన అతని హృదయం మానవులకు సులభంగా మోక్షాన్ని ప్రసాదించే ఆ మంత్రాన్ని దాచుకోలేక పోయింది.
    తన ఆజ్ఞను రామానుజుడు ఈ విధంగా మీరినందుకు తిరుక్కోటి యార్నంబికి చాలా కోపం వచ్చింది.  రామానుజుని తన ఎదుటికి పిలిపించుకొన్నాడు.  తన మాట ఆ విధంగా జవదాటినందుకు అతను శాశ్వతంగా నరకానికి పోతాడని చెప్పాడు.  జన సమూహం మోక్షం పొందడానికి తాను కారణం కాగలిగే పక్షంళొ తాను నరకానికి పోవడానికి సంతోష పూర్వకంగా సంసిద్ధుడై ఉంటానని రామానుజుడు నెమ్మదిగా జవాబు చెప్పాడు.
   రామానుజుని ఖ్యాతి వైశాల్యానికి, ఉన్నతా దర్శానికి ఆగురువు అనంతంగా సంతోషించాడు.  రామానుజుని ఆశీర్వదించి అతని ప్రయత్నం ఫలోదయాంత మవుతుందని చెప్పాడు.
   రామానుజుని హృదయ వాడవాడలా పాకి పోయింది.  తన సిద్ధాంతాల ప్రచారంలో అతను పలువురితో వాదిస్తూ వచ్చాడు.