పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విక్రమసేనమహారాజు కథ.

87


క్షుద్బాధం దీర్చి తనకుం గర్తవ్యంబు నెఱిఁగింపుఁడని వేడుకొనెను. నాజడదారి యాదంపతులం దనయాశ్రమంబునకు గోనిచని యొక్కచో విడియంజేసి, కందమూలాదులం బరితృప్తి జేసి—— "రాజా! నీవిందు సేమముగానుండుము. రేపటిదినం బమావాస్య కావున మహా పర్వంబు; మనమరుపురమును సరోవరంబున స్నానం బాడి యల్లదే యట్ట యెదుటఁ గాన్పించు కాలభైరవాలయంబునకరిగి యద్దేవుని బూజించి వత్త"మనిపలుక నాతండును వల్లేయని యారాత్రి తదాశ్రమంబున సౌఖ్య లీలం గాలముఁబుచ్చెను. మఱునాటి వేకువజాముననే శుచిముఖ యారాకుమానికడ వ్రాలి, రహస్యంబుగ నాతనితో "ఆర్యా! ఈముని యొక కపట వేషధారియని తోఁచెడు; నీకొక చిత్రముం జూపెదర"మ్మని యాశ్రమంబున కనతిదూరంబుననున్న యొకవట ప్రాంతంబున కాతనిం గొనిచనియెను. ఆప్రదేశమంతయు మానవాస్తి కళేబరములతోడను, కపాలములతోడను, కరడుగట్టిన నెత్తుటితోడనునిండి భయానకంబై యుండెను. ఆవటవృక్షశాఖలకుఁ గట్టఁబడిన మానవక పాలములు కొన్ని యావిక్రమసేనుంగాంచి పకపక నవ్వి—— "యోనిర్భాగ్యుఁడా! నీవును మావలెనే యీకపటమునిచే కాలభైరవునకు బలియీయఁబడియెదవు! జాగ్రత్త” అనిపలికెను. విక్రమసేనుండార్చర్యములో నీ మునివృత్తం బెట్టిదని ప్రశ్నింప, నాకపాలములు "రాజపుత్రా! వీడు భైరవపూజా దురంధరుడగు నొకకపటముని, నూర్వురు రాజకుమారులనుగాని, యొక జడదారిని బలియిచ్చినచో కాలభైరవుడు ప్రసన్నుండగునని యెఱింగి, యీదుర్మార్గుఁడిప్పటికి తొంబదితొమ్మండ్రను బలియిచ్చెను. నీవు నూఱవవాఁడవు. ఈ యమవాస్యకు నీబలితో వాని యీప్సితం బీడేరు. కావున నీ వెట్లైన వానిని కాలభైరువునకు బలియిచ్చితివా నీకు ప్రసన్నుండగును హెచ్చరిక" యని పలుక—— విక్రమసేనుఁడు తదుపాయంబు నాలోచించుచు యధాప్రకారముగ నాశ్రమంబునకు వచ్చి యెఱుంగనట్లుండెను. అంతనాకపటముని, రాకుమారు