పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

పండ్రెండురాజుల కథలు


కనుగొనవలయునను పట్టుదల రెట్టింప దానిం బట్టుకొని నడవసాగెను. అట్లాతఁడు పోవంబోవ నెట్టకేల కాశాఖ సముద్ర మధ్యస్థంబగు నొక ద్వీపమునందలి దివ్య సౌధాగ్రమునకు వ్రాలెను. విక్రమసేనుఁడా సౌధముంగని వెఱఁగుపడియు, సాహసంబున శాఖావతరణం బొనరించి, సౌధముం బ్రవేశించెను. ఆసౌధము నిర్మానుష్యమై నిశ్శబ్దమై కాన్పింపనిది యేమిచిత్రమని తలంచుచు, నా రాజనందనుఁడు కక్షాంతరములు గడచిచన నందొక హంసతూలికా తల్పంబున సాక్షాత్కరించిన, జగన్మోహిని నానొప్పారు నొకయొప్పులకుప్ప నేత్రపర్వం బొనరించెను. రాజకుమారుంగని యా రాకాచంద్రవదన సంభ్రమాందోళిత స్వాంతయై——దిగ్గున లేచి—— "యోహో ! పురుషవరేణ్యా ! నీ వెక్కడివాడవు? ఎందుండి యిందువచ్చితివి? దేవమానవ దానవాదుల కగోచరం బగు నీ సౌధంబు నెట్లు ప్రవేశింపగల్గితివి? మాయమ నిను గాంచెనేని యొక్క కబళంబుగా మ్రింగివైచునుసుమా! "యని" పలుక, నాతఁడు తన చరిత్రంబు నెల్ల నాబాలిక కెఱిఁగించి, బాలా! నీ చరిత్రం బేమి? ఏకాంతముగ నీ దీవిపై గల సౌధమున నీవు వసింపఁ గారణమేమి? నీతల్లి యెవ్వరు? అది నన్ను మ్రింగునంతటి దౌర్జన్యమున కేమి హేతు" వని యడుగ, నాకోమలాంగి పూర్వస్మృతిచే గల్గిన దుఃఖంబున వెక్కి వెక్కి యేడ్చుచు, “మహాత్మా! నా చరిత్ర మతిదయనీయమైనది. నేను విహార దేశాధీశ్వరుని పుత్రికను; నన్ను మణిమాల యందురు. నాకైఁదేండ్లు నిండకమున్నే యీద్వీపమున కధికారిణియగు, నేకాక్షి యను దానవి నన్ను తస్కరించి యిందుంచినది. దాని ఫాలభాగంబున నొక్కటియే నేత్రముండుటవలస నేకాక్షి యనఁ బరగుచున్న యది; అతిభయంకర స్వభావము గల్గినది. అది మానవులను భక్షించు స్వభావముగలరాక్షిసి యయ్యును, నన్ను దయతోఁ జూచుచున్నది. కాని నాతలిదండ్రుల కెడబాపి నన్ను దుఃఖమున ముంచినది. నాటినుండియు నేను నరముఖ దర్శనం బెఱుంగక యీ నిర్బంధమున నున్న దానను. నిన్నుఁగాంచినంతనే నాప్రా