పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76

పండ్రెండురాజుల కథలు


కొసంగక నాకిమ్ము——అందులకుమాఱుగ నేను మఱియొకహారంబును నీకిచ్చెదను. దానిని రాజున కిమ్ము—— నీవీ యుపకృతిగావింతువేని నీకు సంతృప్తికరంబగు బహుమానం బొనరింతు” ననిపలుక వాఁడందుల కనుమతించెను.

జీమూతవాహనుండీలోన, శుక్ల పక్ష క్షపాకరుని చందమున ప్రతిదిన ప్రవర్థమానుఁడగుచు, చతురులగు నుపాధ్యాయుల మూలంబున సమస్త విద్యారహస్యంబుల నెఱుంగుచు కన్న వారికిం గన్న వారికిం గూడ గన్నులపండువ సేయుచుండెను. అంత నొక్క దినంబున, మాండవ్య మహర్షి యటకరు దెంచి రాజుచేఁ బూజితుఁడై, కుమారుని గుణరూప శీల సంపదల కెంతయు నాశ్చర్యపడి, యాబాలు నే కాంతమునంజీరి చిరంజీవి వగుమని యాశీర్వదించి——"వత్సా! ఇట్టిసద్గుణాలంకారుని నిన్ను సృజించిన పరమేశ్వరుఁడు ని న్నా యుర్దాయహీనునిగా నెన్నడుం గావింపఁడు. ఆమత్స్యము లభించును. తద్గర్భాంతర్గ తారహారమున నీవు చిరంజీవి వగుదువు. నీకు మహాసురమునీంద్రుల కలభ్యంబగు నిరాకార తత్త్వరహస్యంబు నెఱిఁగింతు నాకర్ణింపు” మని యుపదేశించెను.

అనియెఱిఁగింప నింద్రనందనుం డాశ్చర్యపడి, “బావా! ఆయనంతరము జీమూతవాహనుని చరిత్రం బేమయ్యె నెఱింగింపు" మనవుడు ముకుందుఁడిట్లనియె——"విజయా! ఆకర్ణింపుము. అట్లు జీమూతవాహనునకు నిరాకారప్రభావంబు నెఱింగించి మాండవ్యుఁడు నిజాశ్రమంబున కరిగె——నీకథ యిటులుండ, నటరాజేంద్ర కనిష్టదారయగు విపులాదేవి, మంత్రియగు చారుదత్తునిపైఁ గల, నిర్భర మోహంబు పెంపున నాతఁడు నిర్బంధింపఁ బడియుండిన కారాగారమునుండి—— తనశయనాగారంబున కొక రహస్య భూబిలం బేర్పఱచుకొని, ప్రతిదినంబును రాత్రివేళలఁ దత్కారాగృహంబున కరుదెంచి, చారుదత్తునివశపఱచుకొన విశ్వ ప్రయత్నంబు లొనరించియు విఫలమనోరథ యగుచుండెను. మాండవ్యుఁడీ రహస్యం బును, యోగదృష్టినెఱింగి, విపులగుట్టు బట్టబయలుసేయు నుపా