పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జీమూతవాహనమహారాజు కథ

75


సుందరమూర్తియగు నొక స్త్రీ శిశువుఁ బ్రసవించి, వక్షమునందగిలిన శరబాధవలన వెంటనే మృతినందెను. ప్రచండుడామె మృతికి విచారించి సంస్కారాదులను గావించి, యాముద్దుబిడ్డకు జగన్మోహినియను నామంబునిడి యల్లారుముద్దుగఁ బెంచుచుండెను.

అరణ్యంబున నేశుభముహూర్తంబున జగన్మోహినిజన్మించెనో యంతకు నాల్గుదినంబులకు పూర్వమున కాశ్మీరరాజేంద్రుని పట్టపు దేవి యొక దుర్ముహూర్తంబున నొకమగశిశువుం బ్రసవించెను. భూపాలుఁడు సుపుత్రప్రాప్త వార్త నాలకించి మహదానంద భరితుండై వానికి జీమూతవాహన నామంబిడి, దైవజ్జులంబిలువనంపి, జాతకపరీక్ష సేయింప, వారు పెదవివిఱిచి——"రాజా ! ఈపుత్రుఁడు తనపదునాఱవయేఁట జీవితములంబాయను. ఆయుర్దాయ హీనుం" డని పలికిరి, ఆవార్తనాలకించి రాజేంద్రుఁడు, మిగులదుఃఖించెను. అప్పట్టున మాండవ్య మహర్షి యటకరుదెంచి, “ రాజా ! నీవు దుఃఖింపకుము; సాగరంబున నొక మత్స్యము యొక్క గర్భంబున నొకముక్తాహారముగలదు. ఆహారమును నీవు సేకరింపగల్గుదువేని, దాని నీ బాలుఁడు ధరించినచో మృత్యువును జయింపఁగలడు. కాని దాని, నితరులు ధరించిరేని యీతఁడు మృతినొందును. చతురులగు జాలరుల నంపి యశేషంబులగు సాగరమత్స్యంబులంబట్టి తెప్పింపుము. వానిలో నొకానొక జలచర గర్భంబున నది లభియించు "నని యుపదేశించి చనియెను, ఈవార్తపురమెల్ల వ్యాపించెను. అట్టిచేపం గొనివచ్చినవాని కపారంబగు బహూకృతి గావింపఁబడునని ప్రకటితం బయ్యెను. రాష్ట్రవాసులగు జాలరు లెల్లరుం దమతమ యదృష్టగణనం బొనరించుకొనుచు సాగరాభిముఖులై చనిరి. చిన్న రాణియగు విపుల తోలుత రాజకుమారుఁ డర్ధాయుష్కుఁడని విని యానందించెనే కానీ ముక్తాహారవార్తచే నామె యాశాభంగమునొంది. చేపలంగోసి పరీక్షింప నియమింపఁబడిన, వంటవానినిలోఁబరచుకొని, “యోరీ! ఆ ముక్తాహారము మత్స్యగర్భంబున లభించునేని దానిందొలుత రాజున