పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

పండ్రెండు రాజుల కథలు


డొక వెఱవెఱిఁగింపవేడిరి. అయ్యతి వారినను గ్రహించి వారి భార్యల నటకురప్పింపఁగోర——పట్టమహిషియగు నపర్ణా దేవియు, మంత్రి భార్యయగు వీర బాలయు సత్వరం బరు బెంచిరిగాని, విపులా దేవి శృంగారపరిపూర్తిఁగావించుకొని యేతెంచుటకు జాగయ్యెను. ఈలోన నాయతి, యపర్ణావీర బాలల నిరువుర నాశీర్వదించి వెడలిపోయెను.అనంతర మటకరు దెంచిన విపుల కార్యముమించినందులకు వగచుచు, నపర్ణాదేవికి పుత్రప్రాప్తీగలునై యుండుటకు మానసంబున నీర్ష్యపూరితయై యుండెను. అనతిదినంబులకే రాజమంత్రులదారలు గర్భవతుల పతులతో పాటుగ సర్వరాష్ట్రవాసులకునుఁ బ్రమోదముఁగల్గించిరి. మంత్రి యగు చారుదతుని వలచిన విపుల రాజాజ్జగా వార్తనంపి యొకదినంబున, చారుదత్తుని దనయేకాంతాగారమునకు రప్పించుకొని, తనవలపుం ప్రకటింప నాతఁడప్పాపకార్యంబున కియ్యకొనడయ్యె—— ఇంతలో విధివశంబున నటకు ధరాధిపుం డరుదెంచుటయు——కార్యము తప్పి వచ్చెనని గ్రహించి విపుల చిత్రాంగివోలె——హఠంబువహియించి, తానొనర్ప నెంచిన పాపకార్యంబును మంత్రియే యెనరింపనెంచి యటకు వచ్చెనని రాజుతో గొండెములు బలుక, సత్యాసత్యములను విమర్శింపక రాజు సచివుని కారాగృహమున ద్రోయించెను. అప్పటికి గర్భవతియై యున్న సచినభార్యయగు వీరబాల మహాశోకంబున మతిచెడి, యడవులంబడి యెందేనింజని యొక నికుంజంబున జలహీనతచేఁ బడియుండెను. ఆయరణ్యవాసుల కధినాధుఁడగు ప్రచండుడనువాడు మృగయావినోద తత్పరుఁడై యటఁజరించుచుండ తత్పరిచరులలో నొక్కఁడు నికుంజంబు నంబడియున్న వీరబాలను కొండొకమృగముగా భ్రమించి, శరంబువదలనది యాతరుణివక్షంబునఁ దగిలెను. శరబాధచే వీరబాల యాక్రోశించుట నాలకించి, ప్రచండుడు తనవారి ప్రమాదంబును గుఱ్తించి యామెను భద్రంబుగ దనయాశ్రమముం జేర్చి యుపచర్యలొనరింపదొడఁగెను. వీరబాల తనచరిత్రమునెల్ల ప్రచండున కెఱిఁగించి యొకదినంబున, నత్యంత