పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

పండ్రెండురాజుల కథలు

కొకటి తలంచెను. నీప్రియుని స్త్రీ రూపంబునంగాంచి, నీసోదరుఁడు మదన శరాహతుండై తల్లడిల్లుచున్న వాఁడు, ఎట్లయిన తనకుంగూర్పుమని నన్ను వేడుకొనియె. అదియునుంగాక, నీయందు గర్భచిహ్నంబులు పొడసూపుచున్నయవి. కాల కేతనుఁడిక నిచ్చోట విశేష కాలముండిన ప్రమాదంబుగలుగఁగలదు. అతనిఁ గొంతకాలమెటకైనఁ బంపుట సర్వ శ్రేయ ” మని పలుక, నాబిబ్బోక నతి నిజప్రియ విశ్లేషంబున కోర్వనోపక పెల్లుగతల్లడిల్లి శోకింపసాగెను. తుదకు గత్యంతరముగానక, కాల కేతనుఁ డామె నెట్లో సమాధానపఱచి, వలయు ధనంబును, ఒకయుత్తమాశ్వంబును గైకొని యొకనాటి రాత్రి రహస్య మార్గంబున పురంబు వెలువడి యెందేనింజనియె.మఱునాడు మాణి భద్రునికడ కరిగి మాలతి” భర్తృదారకా ! తమ యభిప్రాయంబును నే నాకాంత కెఱిఁగించితిని. అప్పటి కనుమతించినట్లే కాన్పించెను. కాని తెల్లవాఱునప్పటి కేందో చనినది. మాయూరికి గూక వార్తనంపితిని. అటకును జనినట్లు లేదు. ఎందుజనెనో తెలియ ” దనిపలుక నారాజపుత్రుడు శోభహతుండై యక్కాంతనారయ నలువంకలకును దూతలనంపెను.

ఇదియిట్లుండనట—— కాల కేతనుని జనకుఁడగు సూర్య కేతనమహారాజు, మఱునాడు పాతాళమందిరంబున, కాల కేతనుంగానక, పరితపించు చుండ, పుత్రిక యగు పాంచాల, జసకునియనుమతింగొని, విశ్వాసపాత్రురాలగు తరళ యనుచేటిని వెంటగొని, యిరువురును పురుషరూపంబులను దాల్చి——కాలకేతను నన్వేషింప దేశాంతరగతులైరి.

కాలకేతనుండట్లు——కుంతల రాజ్యంబు విడచి యొక మహారణ్యముం బ్రవేశించి, మణిమంజరీ విశ్లేషంబున నన్యాధీనమనసుఁడై——నారదమహర్షియాశ్రమము బ్రవేశించి యాముని పాదకమలముల బట్టుకొని ప్రార్థించి, తనయుదంత మెల్ల నెఱిఁగింప నాతఁడునవ్వి " కుమారా ! ఎంత వెఱ్ఱివాఁడవైతివి? అనశ్వరంబగు ముముక్షు మార్గంబు నెఱుంగక, హేయంబగు