పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కామవర్ధన మహారాజు కథ

61


తీతంబై యుండెను. ఈలోన వసంతుఁడిక దాపనేలనని రయంబున రాజమందిరంబునకరిగి “మియల్లుం డరుదెంచె" నని వారల కెఱిగించెను. హరిదత్తచక్రవర్తివచ్చె ననువార్త క్షణంబున నగరం బెల్లవ్యాపింప, నా బాలగోపాలం బాసత్రంబున నిసుక వేసినరాలనట్లు నిండి పోయెను. విదర్భరాజు సాలంకృతంబులగు పట్టపు టేనుంగులపై మహావిభవంబున నల్లుని వసంతుని వియ్యంకుని, వియ్యంపురాలిని, నగరికింగొనిచని మహానందపరవశుం డయ్యెను. హరిదత్తుఁ డచ్చముగ తన ప్రతిచ్ఛాయంబోలి జనించిన కుమారునెత్తి ముద్దాడుచు నిజసతీమణికిని, విలాసినికిం బ్రియంబు చేకూర్చి, పిదప, తనవలెనే యున్న యాయువకుని రహస్యంబుగఁ బిలిచి, "నాయనా! నీవు నావలె నుండుట కేమికారణము నీ తలిదండ్రు లెవ్వరు? ఇట్లేలవచ్చితివి? నీచరితంబును దాచక నా కెఱిఁగింపు" మని యడుగ నాతఁడు, "రాజచంద్రమా! నేను వారణాశీపురంబు నందలి విష్ణుపాదుండను విప్రునకు దత్తపుత్రుండను. నన్నెవ్వరో రాజదంపతులు బాల్యంబుననే యాతనికొసంగి చనిరట! ఆవిప్రుఁడు నన్నతిగోపమునం బెంచి సమస్త విద్యావిశారదునిగా నోనరించినను నావిధి వక్రగతి నుండుటంజేసి యా విష్ణుపాదుని తృతీయకళత్రము, నాకు యౌవనంబు వచ్చినంతనే , నాతోడి దుస్సహవాసంబు నభిలషించి నే అను మతింపకున్నంత, చిత్రాంగివోలె రోషంబువహించి తన పతితో నాపై గొండెములు పలికి నన్ను గృహమునుండి వెడల నడిపించెను. అంత నేను నిరాధారినై యందందు దిరుగుచు, భోజరాజ్యంబున కరిగి యందోక యుద్యానవనంబున గూర్చుండియుండ నా దేశాధీశ్వరుని తనయ యగు చారుదత్తయు, సఖియగు చతురయు నటకు విహారార్థ మరుదెంచిరి. అంత నా చారుదత్త నన్ను గాంచి మోహవశయై చెలితోడ రాయబారం బొనరింపంజేసి రేపటి సాయంకాలమున కిటకు మరల రమ్మని యట్లు నాచే బాసచేయించుకొని యానాటికి నన్ను వదలి చనిరి. అయ్యది ప్రమాకరంబని నేను భీతిల్లి యాపురంబును వదలి యిటకురాగా నిట" నీవే